Tamil Nadu | మాజీ భర్తను హత్య చేసిన వ్యభిచారిణి.. ముక్కలు ముక్కలుగా నరికివేత
Tamil Nadu | విధాత: ఓ వ్యభిచారిణి దారుణానికి పాల్పడింది. తన మాజీ భర్తను దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేసింది. అనంతరం ఆ శరీర భాగాలను పూడ్చిపెట్టింది. ఈ ఘటన తమిళనాడు(TamilNadu) రాజధాని చెన్నై సమీపంలోని కోవలమ్(Kovalam)లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( Chennai Airport )లో ఓ వ్యక్తి ప్రయివేటు ఎయిర్‌లైన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను తన సోదరి నివాసంలో ఉంటున్నాడు. అయితే మార్చి 18వ […]

Tamil Nadu |
విధాత: ఓ వ్యభిచారిణి దారుణానికి పాల్పడింది. తన మాజీ భర్తను దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేసింది. అనంతరం ఆ శరీర భాగాలను పూడ్చిపెట్టింది. ఈ ఘటన తమిళనాడు(TamilNadu) రాజధాని చెన్నై సమీపంలోని కోవలమ్(Kovalam)లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( Chennai Airport )లో ఓ వ్యక్తి ప్రయివేటు ఎయిర్‌లైన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను తన సోదరి నివాసంలో ఉంటున్నాడు. అయితే మార్చి 18వ తేదీన విధులకు వెళ్లిన ఉద్యోగి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని సోదరి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చి 20న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ కాల్ డేటా ఆధారంతో..
ఆ ఉద్యోగి ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో అతని నంబర్ ఆధారంగా కాల్ డేటా సేకరించారు. చివరి సారిగా ఎవరితో మాట్లాడరనే అంశంపై విచారణ చేపట్టారు. పుడుకొట్టైలోని జీ భాగ్యలక్ష్మి అనే మహిళతో మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమెను విచారించారు.
ఆ వ్యక్తితో తనకెలాంటి సంబంధం లేదని మొదట ఆమె బుకాయించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించింది. మరో వ్యక్తితో కలిసి అతన్ని చంపినట్లు ఒప్పుకుంది. అనంతరం శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చెన్నై సమీపంలోని కోవలమ్ వద్ద పూడ్చిపెట్టినట్లు తెలిపింది.
కొన్నేండ్ల క్రితం తామిద్దరం ఓ ఆలయంలో వివాహం చేసుకున్నామని, ఆ తర్వాత విడిపోయినట్లు మహిళ తెలిపింది. మార్చి 18వ తేదీన మళ్లీ తన వద్దకు రావడంతో హత్య చేసినట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆ మహిళ వ్యభిచారిణిగా జీవితాన్ని గడుపుతుందని పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.