సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు

ఘటోత్కచుడి విందును మించిపోయింది! అత్తారింటికి వచ్చిన అల్లుడికి ఏకంగా 1,116 రకాల వంటకాలతో భోజనం. ఏలూరు జిల్లాలో సరికొత్త రికార్డు సృష్టించిన సంక్రాంతి మర్యాదలు.

సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు

విధాత: ఏపీలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వెళ్లిన అల్లుళ్లకు మర్యాదలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెనాలిలో మురళికృష్ణ, మాధవీలత దంపతులు సంక్రాంతికి తొలిసారి అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడు శ్రీదత్త,కుమార్తె మౌనికలకు 158రకాల వంటలతో విందుతో వార్తల్లో నిలిచారు. ఈ రికార్డును నర్సీపట్నం రమేష్ కుమార్ కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్షకు,కూతురు లక్ష్మీనవ్యలకు 290 రకాల వంటకాలతో పసందైన విందు ఇచ్చి అధిగమించారు.

ఏలూరులో ఏకంగా 1,116రకాల వంటకాల విందు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన అంతర్జాతీయ వైశ్య ఫెడరే షన్(ఐవీఎఫ్) సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోనా హనుమాన్ బాబు, కళ్యాణి దంపతులు తమ అల్లుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నారాయణం సంజయ్‌, కుమార్తె శ్రీజలకు ఏకంగా 1,116 రకాల వంటకాలతో భోజనం వడ్డించి సరికొత్త రికార్డు సృష్టించారు. పెళ్లయిన తర్వాత మొదటి సంక్రాంతికి అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడు సంజయ్ కి 1,116రకాల వంటకాలతో విందు పెట్టడంతో వాటన్నింటిని రుచి చూడలేక అవస్థలు పడటం అతని వంతు అయ్యింది.

విస్తరిలో గారెలు, బూరెలు, అరిసెలు వంటి సాంప్రదాయ పిండివంటల నుంచి మొదలుకుని ఆధునిక వంటకాల వరకు రకరకాల ఆహార పదార్ధాలు వడ్డించారు. అంత భారీ సంఖ్యలో వాటిని చూసి బెదిరిపోయిన కొత్త కొత్త అల్లుడు, కూతురు ఇక వాటిని తినడంలో పడిన తిప్పలు మయాబజార్ సినిమా ఘటోత్కచుడి వివాహభోజనంబు పాట సన్నివేశాన్ని తలపించింది.

ఇవి కూడా చదవండి :


Municipal Reservations : మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
Maoist Encounter : మావోయిస్టు అగ్రనేత పాపారావు ఎన్ కౌంటర్