ఒంటరి మహిళపై కన్నేశాడు.. పెళ్లి పేరుతో అత్యాచారం
Facebook Love | ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయంతో.. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ ఆమె మరో యువకుడిని వివాహం చేసుకుంది. కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఫేస్‌బుక్ ప్రేమికుడు.. ఆమెతో మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన […]

Facebook Love | ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయంతో.. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ ఆమె మరో యువకుడిని వివాహం చేసుకుంది. కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఫేస్‌బుక్ ప్రేమికుడు.. ఆమెతో మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన ఓ యువతి(22)కి ఎం రమేశ్ బాబు అనే యువకుడు 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు. ఆ సమయంలో యువతి విజయవాడలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేది. నిన్ను ప్రేమిస్తున్నానంటూ రమేశ్ బాబు ఆమె వెంట పడ్డాడు. కానీ ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఇక యువతి ఒంటరిగా ఉంటూ.. సూర్యరావుపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న రమేశ్ బాబు ఆమెతో మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ క్రమంలో జనవరి 14వ తేదీన గుంటూరు బస్టాండ్ సమీపంలోని తన బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు. తాము దంపతులమని చెప్పి రెండు రోజుల పాటు ఆ ఇంట్లో గడిపాడు రమేశ్ బాబు. ఈ క్రమంలో ఇరువురు పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యారు. 16వ తేదీన విజయవాడ బస్టాండ్‌లో వదిలేశాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేస్తున్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సూర్యరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.