Viral Video | మెట్రోలో యువ‌కుడి చెంప ఛెల్లుమ‌నిపించిన మ‌హిళ‌

Viral Video | ఢిల్లీ మెట్రోలో ఇటీవ‌ల కాలంలో ప్ర‌యాణికుల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. మెట్రోలో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ ఉన్న‌ట్టుండి.. త‌న‌కు ఎదురుగా నిల్చున్న యువ‌కుడిపై దాడి చేసింది. అత‌ని చెంప ఛెల్లుమ‌నిపించింది. అంత‌టితో ఆగ‌కుండా ఆ యువ‌కుడిని తిట్టింది. అయితే వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకు జ‌రిగింది..? ఒక‌రికొక‌రు తెలిసిన వ్య‌క్తులా? అనే విష‌యాలు తెలియ‌రాలేదు. ఇక ఈ వీడియోను ఓ […]

Viral Video | మెట్రోలో యువ‌కుడి చెంప ఛెల్లుమ‌నిపించిన మ‌హిళ‌

Viral Video | ఢిల్లీ మెట్రోలో ఇటీవ‌ల కాలంలో ప్ర‌యాణికుల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగు చూసింది. మెట్రోలో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ ఉన్న‌ట్టుండి.. త‌న‌కు ఎదురుగా నిల్చున్న యువ‌కుడిపై దాడి చేసింది. అత‌ని చెంప ఛెల్లుమ‌నిపించింది. అంత‌టితో ఆగ‌కుండా ఆ యువ‌కుడిని తిట్టింది.

అయితే వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకు జ‌రిగింది..? ఒక‌రికొక‌రు తెలిసిన వ్య‌క్తులా? అనే విష‌యాలు తెలియ‌రాలేదు. ఇక ఈ వీడియోను ఓ యూజ‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ వీడియోపై నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. వారిద్ద‌రూ తెలిసిన వ్య‌క్తులే అయి ఉండొచ్చు.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉండొచ్చ‌ని ఓ యూజ‌ర్ పేర్కొన్నారు. యువ‌కుడిపై దాడిని ఏ ఒక్క‌రూ అడ్డుకోక‌పోవ‌డం విచార‌క‌రం.. మ‌నం ఏ ప్ర‌పంచంలో ఉన్నాం అని మ‌రో నెటిజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక వేళ అదే స్థానంలో యువ‌కుడు మ‌హిళ‌పై దాడి చేసి ఉంటే.. అక్క‌డున్న వారంతా అత‌నిపై దాడి చేసేవార‌ని మ‌రో యూజ‌ర్ పేర్కొన్నాడు.