Women Fighting | డిస్కౌంట్ సేల్.. చీర‌ల కోసం సిగ‌పట్లు ప‌ట్టుకున్న మ‌హిళ‌లు

Women Fighting విధాత‌: మ‌హిళ‌ల‌కు షాపింగ్ అంటే మ‌హా ఇష్టం. అందులోనూ చీర‌ల షాపింగ్ అంటే క్ష‌ణాల్లోనే రెడీ అయిపోతారు. మ‌రీ డిస్కౌంట్ సేల్ అంటూ.. ఆ షాపు వ‌ద్ద క్ష‌ణాల్లో వాలిపోతారు. ఇష్ట‌మైన చీర‌ల‌ను కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతారు. ఇక న‌చ్చిన చీర క‌నిపించిందంటే చాలు.. దాని కొనేందుకు వెనుకాడ‌రు. అయితే ఓ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఒకే చీర న‌చ్చింది. నాక్కావాలంటే నాకు కావాల‌ని కొట్లాడారు. అంత‌టితో ఆగ‌లేదు.. సిగ‌ప‌ట్లు ప‌ట్టుకున్నారు. చెప్పుల‌తో కొట్టుకున్నారు. […]

Women Fighting | డిస్కౌంట్ సేల్.. చీర‌ల కోసం సిగ‌పట్లు ప‌ట్టుకున్న మ‌హిళ‌లు

Women Fighting

విధాత‌: మ‌హిళ‌ల‌కు షాపింగ్ అంటే మ‌హా ఇష్టం. అందులోనూ చీర‌ల షాపింగ్ అంటే క్ష‌ణాల్లోనే రెడీ అయిపోతారు. మ‌రీ డిస్కౌంట్ సేల్ అంటూ.. ఆ షాపు వ‌ద్ద క్ష‌ణాల్లో వాలిపోతారు. ఇష్ట‌మైన చీర‌ల‌ను కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతారు.

ఇక న‌చ్చిన చీర క‌నిపించిందంటే చాలు.. దాని కొనేందుకు వెనుకాడ‌రు. అయితే ఓ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు ఒకే చీర న‌చ్చింది. నాక్కావాలంటే నాకు కావాల‌ని కొట్లాడారు. అంత‌టితో ఆగ‌లేదు.. సిగ‌ప‌ట్లు ప‌ట్టుకున్నారు. చెప్పుల‌తో కొట్టుకున్నారు. అక్క‌డే విధుల్లో ఉన్న ఓ పోలీసు, ఆ దుకాణం సిబ్బంది ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను విడిపించారు.

అయితే ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క మైసూరులోని మ‌ల్లేశ్వ‌రంలోని ఓ బ‌ట్ట‌ల దుకాణంలో వెలుగు చూసింది. మైసూర్ సిల్క్ శారీ సెంట‌ర్ ఇటీవ‌లే డిస్కౌంట్ ధ‌ర‌ల‌తో ఇయ‌ర్లీ శారీ సేల్ నిర్వ‌హించింది. ఆ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంది.