Wrestlers | బ్రిజ్‌కు వ్యతిరేకంగా ఆధారాలుంటే ఇవ్వండి.. ఇద్దరు రెజ్లర్లకు పోలీసులు నోటీసులు
Wrestlers విధాత: ఊపిరి సామర్థ్యం చూసే వంకతో తమ ఎద భాగాన్ని, కడుపును తాకారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఇద్దరు రెజ్లర్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆరోపణలను బలపరిచేలా ఫొటో, వీడియో, ఆడియో ఆధారాలను ఇవ్వాలని ఫిర్యాదుదారులను అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. తనను కౌగిలించుకున్నారని వీరిలో ఒక యువతి చెప్పినందున ఆ ఫొటోనూ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 21న ఢిల్లీలోని […]
Wrestlers
విధాత: ఊపిరి సామర్థ్యం చూసే వంకతో తమ ఎద భాగాన్ని, కడుపును తాకారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఇద్దరు రెజ్లర్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆరోపణలను బలపరిచేలా ఫొటో, వీడియో, ఆడియో ఆధారాలను ఇవ్వాలని ఫిర్యాదుదారులను అడిగినట్లు విశ్వసనీయ సమాచారం.
తనను కౌగిలించుకున్నారని వీరిలో ఒక యువతి చెప్పినందున ఆ ఫొటోనూ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 21న ఢిల్లీలోని కన్నౌట్ పోలీసు స్టేషన్‌లో వీరు బ్రిజ్‌పై ఫిర్యాదు చేశారు. టోర్నమెంట్‌లు, టోర్నీ సన్నాహక సెషన్లు, డబ్ల్యూఎఫ్ ఐ కార్యాలయంలో బ్రిజ్ ఈ వేధింపులకు పాల్పడినట్లు వారు ఫిర్యాదులో ఆరోపణలు చేశారు.
ఈ మేరకు మీ దగ్గర బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తమకు సమర్పించాలని సీఆర్‌పీసీ 91 కింద జూన్ 5న ఆ ఇద్దరు యువతులకు వేర్వేరుగా నోటీసులు అందాయి. ఘటన జరిగిన సమయం, తేదీ, ఎన్ని సార్లు వారు డబ్ల్యూఎఫ్ ఐ కార్యాలయానికి వెళ్లారు? వెళ్లినప్పుడు ఎంత సేపు గడిపారు? వారి రూమ్మేట్ల వివరాలు, వారేమైనా చూశారా తదితర వివరాలను అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆరోపణలు చేసిన ఫిర్యాదుదారుల్లో ఒకరి బంధువుకి పోలీసులు నోటీసులు పంపారు.
కావాలని ఇబ్బంది పెడుతున్నారు..
ఈ పరిణామాలపై రెజ్లర్లు స్పందించారు. ఫిర్యాదుదారులు వెనకడుగు వేసేలా పోలీసులు వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. జూన్ 15 లోపు బ్రిజ్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram