Young Woman Revolver: కారు దిగమంటావా..కాల్చిపడేస్తా..రివ్వాల్వర్ తో యువతి హల్చల్ !

విధాత : పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపే క్రమంలో కారులో నుంచి దిగాలని చెప్పినందుకు బంక్ సిబ్బందిపై ఓ యువతి ఏకంగా తుపాకీతో రెచ్చిపోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని సాండి రోడ్ వద్దనున్న పెట్రోల్ పంప్‌కు వెళ్లిన ఎహ్సాన్ ఖాన్ కుటుంబం కారులో సీఎన్‌జీ గ్యాస్ నింపాలని కోరారు. బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ కారులో కూర్చున్న వారిని కిందకు దిగమని కోరాడు. తాము కారు దిగనవసరం లేదని..సీఎన్‌జీ నింపాలని చెప్పడంతో.. అందుకు బంక్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఎహ్సాన్ కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా రివాల్వర్ తీసుకుని బంక్ ఉద్యోగిపైకి ఆవేశంగా వెళ్లారు. ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి.. సీఎన్‌జీ నింపుతావా? లేక కాల్చేయనా? అంటూ బెదిరిస్తూ హల్చల్ చేసింది.
ఇత్నీ గోలియాన్ మారుగీ కి ఘర్ వాలే పెహచాన్ నహీ పయేగే (మీ కుటుంబం నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లు దించి చంపేస్తా) అని అరీబా వార్నింగ్ ఇచ్చింది. ఛాతిపై రివాల్వార్ గురిపెట్టినా రజనీష్ కుమార్ భయపడకపోవడం విశేషం. ఆవేశంతో ఉన్న ఆ యువతిని కుటుంబ సభ్యులు సముదాయించి వెనక్కి తీసుకెళ్లారు. అరీబా పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ పై గన్ గురి పెట్టినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై బంక్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని.. లైసెన్స్ డ్ రివాల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్ పంప్లో తుపాకీతో రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని సాండి రోడ్ వద్దనున్న పెట్రోల్ పంప్‌కు వెళ్లిన ఎహ్సాన్ ఖాన్ కుటుంబం
సీఎన్‌జీ నింపమని చెప్పగా.. కారులో కూర్చున్న వాళ్లు కిందకు దిగమని కోరిన ఉద్యోగి రజనీష్ కుమార్
తాము కారు దిగమని.. సీఎన్… pic.twitter.com/LJphnDS6RL
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 16, 2025