YS Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్.. పోలీసులపై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు
YS Sharmila పోలీసులపై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు షర్మిల బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు వచ్చే నెల 8వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దపోలీసులపై చేయి చేసుకున్నందుకు ఆమెపై కేసు నమోదైంది. ఉదయం షర్మిలను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై 353, 332, 509, […]

YS Sharmila
- పోలీసులపై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు
- షర్మిల బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
- కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం
తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)కు నాంపల్లి కోర్టు వచ్చే నెల 8వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దపోలీసులపై చేయి చేసుకున్నందుకు ఆమెపై కేసు నమోదైంది. ఉదయం షర్మిలను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై 353, 332, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పనిచేస్తారని, అలాంటి వారిపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందన్నారు.
షర్మిల(YS Sharmila) తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కాలికి గాయాలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరో మహిలా కానిస్టేబుల్ తో పాటు, ఎస్సైపైనా షర్మిల చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
షర్మిల(YS Sharmila) తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆమెను అడ్డుకున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ షర్మలను పోలీసులు బైటకు అనుమతించడం లేదని అన్నారు. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల(YS Sharmila) కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చాలామంది పోలీసులు తనను అడ్డుకొని చేయి విరిచే ప్రయత్నం చేశారని, తనను కొట్టారని అన్నారు. ఈ క్రమంలో నేను వాళ్లను తోసేశాను అని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మొదట తీర్పు రిజర్వ్ చేసింది. అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు వెల్లడించింది. కాగా.. షర్మిల బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసిది. న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.