Ys Sharmila | వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Ys Sharmila | వైఎస్ షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సుపరిచితురాలు. ప్రస్తుతం ఆమె కొడుకు రాజారెడ్డిని హీరోగా లాంచ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. సినిమా హీరోగా అవ్వాలని రాజారెడ్డి చిన్న తనం నుంచి అనుకుంటున్నారట. తాజాగా వైయస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. మరి రాజారెడ్డిని హీరోగా లాంచ్ చేసేందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్టోరీ కూడా ప్రిపేర్ చేశారట, ఆ కథ కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ గా […]

  • By: sn    latest    Jul 09, 2023 5:21 PM IST
Ys Sharmila | వైఎస్ షర్మిల కొడుకు హీరోగా సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Ys Sharmila |

వైఎస్ షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సుపరిచితురాలు. ప్రస్తుతం ఆమె కొడుకు రాజారెడ్డిని హీరోగా లాంచ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. సినిమా హీరోగా అవ్వాలని రాజారెడ్డి చిన్న తనం నుంచి అనుకుంటున్నారట. తాజాగా వైయస్ షర్మిళ కొడుకు హీరోగా లాంచ్ చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయట.

మరి రాజారెడ్డిని హీరోగా లాంచ్ చేసేందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్టోరీ కూడా ప్రిపేర్ చేశారట, ఆ కథ కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండబోతుందట. మరి ఈ విషయంలో ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు కానీ.. దీనికి సంబంధించిన వార్తలు మాత్రం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక హీరోగా ట్రైన్ అవ్వడానికి రాజారెడ్డి ఇప్పటికే అమెరికాలో ఓ ఫిల్మ్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. అలాగే బాడీ లాంగ్వేజ్, ఫిట్ నెస్ విషయంలో కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారట.

గతేడాది రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యూయేషన్ కూడా కంప్లీట్ చేశారు. రాజారెడ్డికి డిగ్రీ ఇచ్చినప్పుడు షర్మిల, అండ్ ఫ్యామిలీ కూడా అమెరికా వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజారెడ్డి ఫోటోలు చూస్తే నిజంగానే హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరి పూరీ డైరెక్షన్ లో రాజారెడ్డి హీరోగా మూవీ అంటే వైఎస్ అభిమానుల సపోర్ట్ కూడా ఉంటుంది. దీంతో పాటు మూవీ రిలీజ్ కు ముందే ఫుల్ క్రేజ్ కూడా వస్తుంది. ఇక పూరీ జగన్నాథ్, రాజారెడ్డి హీరో అయితే సినీ అభిమానుల్లోనూ ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతంది.

ఇక పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ లోనే ప్రజంట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ను ప్లాన్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ 2 పేరుతో టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సినిమా రిలీజ్ డేట్ ను కూడా రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేశారు.

లైగర్ తో డల్ అయిన పూరీ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం పక్కా అంటున్నారు పూరీ అభిమానులు.. ఇక ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్.. సాలిడ్ కంటెంట్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.