దేశంలో జడ్+ భద్రత ఎంతమందికి ఉందో మీకు తెలుసా..?
ఖర్చుల వివరాలు లేవని చెప్పిన కేంద్ర హోంశాఖ ఆర్టీఐని అడిగిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మనదేశంలో వ్యక్తిని బట్టి, వ్యక్తికి ఉన్న హోదాను బట్టి భద్రత ఉంటుంది. భారతదేశంలో విఐపిలకు, వివిఐపిలకు కొదవేలేదు.. దేశంలోనే అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర నామినెటేడ్ పదవులు ఉన్నవారికి కూడా వారి హోదాను బట్టి పటిష్టమైన భద్రత ఉంటుంది.. దేశంలో ఎక్కువ శాతం నాయకులు, అధికారుల సెక్యూరిటి కోసమే […]

- ఖర్చుల వివరాలు లేవని చెప్పిన కేంద్ర హోంశాఖ
- ఆర్టీఐని అడిగిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్
మనదేశంలో వ్యక్తిని బట్టి, వ్యక్తికి ఉన్న హోదాను బట్టి భద్రత ఉంటుంది. భారతదేశంలో విఐపిలకు, వివిఐపిలకు కొదవేలేదు.. దేశంలోనే అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర నామినెటేడ్ పదవులు ఉన్నవారికి కూడా వారి హోదాను బట్టి పటిష్టమైన భద్రత ఉంటుంది.. దేశంలో ఎక్కువ శాతం నాయకులు, అధికారుల సెక్యూరిటి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.
ఉన్నమాట: దేశంలో అత్యున్నత ప్రత్యేక భద్రత కొంతమంది ప్రముఖులకు ఉంటుంది. దానిని జడ్ ప్లస్ సెక్యూరిటీ అంటారు. దేశంలో అత్యున్నత భద్రతను కల్పించే వింగ్‌గా జడ్ ప్లస్ సెక్యూరిటికి పేరుంది.. అసలు దేశంలో ఎంతమంది ప్రముఖులకు, నాయకులకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు.
దానికి ఎంత ఖర్చు చేస్తున్నారనే సమాచారాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సమాచార హక్కు చట్టం కేంద్రాన్ని ప్రశ్నించింది. దానికి కేంద్ర హోంశాఖ పీఐవో రాజీవ్ శర్మ సమాధానం ఇచ్చారని సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.

దేశవ్యాప్తంగా 43 ప్రముఖులకు జడ్ ప్లస్, 66 మందికి జడ్, 81మందికి వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశంలో ఎంత మందికి జడ్, జడ్ ప్లస్, వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీలు ఉన్నాయి. వారి వివరాలు తెలపండి. అందుకు ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నారు, వారి ఖర్చుల వివరాలు తెలపాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచారహక్కు చట్టం ద్వారా కేంద్ర హోంశాఖ అధికారులను ప్రశ్నించారు.
ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ప్రమాదం ఆధారంగా ఎక్స్, వై, వై ప్లస్, జడ్, జడ్ ప్లస్ భద్రతను కల్పించడం జరుగుతొందని కేంద్ర హోంశాఖ పీఐవో రాజీవ్ శర్మ సమాధానం చెప్పారు. భద్రతాపరంగా సమీక్షిస్తూ భద్రతను మరింత పెంచడం, తగ్గించడం కొనసాగిస్తామన్నారు. భద్రతకు చేసే ఖర్చుల వివరాలు తమ దగ్గర లేవని తెలిపారని పౌండర్ రాజేంద్ర అన్నారు.