Train Rams Truck | రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో
జార్ఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం! క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్. గేటు తెరిచి ఉండటమే కారణమా? వైరల్ అవుతున్న వీడియో..
జార్ఖండ్ (Jharkhand)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్వే క్రాసింగ్ వద్ద లారీని రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కొందరు గాయాలతో బయటపడ్డారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. దేవఘడ్ జిల్లా (Deoghar district)లోని రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ (Nawadih railway crossing) వద్ద నిన్న ఉదయం గేటు పడలేదు. దీంతో పలు వాహనాలు రైల్వే గేట్‌ను క్రాస్ చేస్తున్నాయి. ఇంతలో గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు మెల్లగా వచ్చింది. గేటును క్రాస్ చేస్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్కు పక్కన ఉన్న వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సిగ్నల్ క్లియరెన్స్ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్ మ్యాన్ ఆరోపించాడు. ఈ ప్రమాదం వల్ల జైసిద్-అసన్‌సోల్ మార్గంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడకపోవడం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ధ్వంసమైన రైలు ఇంజిన్‌ను అక్కడ నుంచి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Train collided with a truck at a busy manned crossing in Deoghar, Jharkhand, India. 🇮🇳
Two motorcyclists sustained serious injuries and were rushed to a nearby hospital with the help of local residents. pic.twitter.com/auGNP9J6Br
— Shihab (@ShihabudeenMb) January 22, 2026
ఇవి కూడా చదవండి :
Elon Musk | ట్రంప్ గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు.. మామూలుగా లేదుగా
Pragya Jaiswal | గ్రీన్ డ్రెస్ లో మతి పోగోట్టిన ప్రగ్యా.. ఇంత హాట్ గా ఉంటే తట్టుకోవడం కష్టమే భయ్యా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram