Rasi Phalalu: Feb21, శుక్రవారం.. ఈరోజు మీ రాశి ఫలాలు! వారికి జీతభత్యాలు పెరిగే సూచనలు

Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 21)న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. ప్రయత్నకార్యాల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం. సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు. అన్ని రంగాల వారికి అనుకూలం.
వృషభం
సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. ఆకస్మిక ధనలాభంతో ఆనందం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఇతరులకు ఉపకారం. స్త్రీల వళ్ల లాభం. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి.ఆస్తి వ్యవహారంలో శుభవార్తలు. రుణబాదలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు. ఆహారం, విహారాల్లో జాగ్రత్త అవసరం
మిథునం
పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు. స్త్రీల వళ్ల లాభాలు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. కుటుంబమంతా సౌఖ్యం. ఆదాయం వృద్ది చెందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. సన్నిహితులను కలుస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు.
కర్కాటకం
అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఆకస్మిక ధనలాభం. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని అద్భుతమైన అవకాశాలు. అన్నింటా విజయం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం. వృత్తి జీవితం బిజీ. నూతన గృహకార్యాలపై శ్రద్ధ. ఆకస్మిక ధనలాభం. బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాలు. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలం. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికం. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు.
కన్య
ఉద్యోగ వాతావరణం అనుకూలం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. ఆకస్మిక ధనలాభం, రుణబాధలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడ. సమాజంలో మంచిపేరు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. గతం కంటే మెరుగ్గా ఆర్థిక వ్యవహారాలు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. పనిభారం, ఒత్తిడి తగ్గుముఖం.
తుల
ఉద్యోగంలో బరువు బాధ్యతలు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య వల్ల బలహీనులవుతారు. వృత్తి, వ్యాపారాలలో రాబడి. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా తప్పదు. తోబుట్టువులతో కలిసి విందులో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పిల్లల చదు వుల విషయంలో శుభవార్తలు.
వృశ్చికం
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు. మిక్కిలి ధైర్య సాహసాలు ఉంటాయి. సూక్ష్మబుద్ధితో విజయం సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. శతృబాధలు తొలగిపోతాయి. సులభంగా శుభకార్య ప్రయత్నాలు. వ్యయ ప్రయాసలతో వ్యవహారాలు పూర్తి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు.
ధనుస్సు
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం. అనుకోకుండా కుటుంబంలో కలహాలు. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త వహించాలి. వృత్తి జీవితంలో ఉన్నవారికి రాబడి. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనలు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి. నిరుద్యోగులకు శుభవార్త.
మకరం
ఉత్సాహంగా కుటుంబ ఉద్యోగ జీవితం. నిలకడగా ఆదాయం. కలహాలు దూరం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. వృథా ప్రయాణాల వల్ల అలసట. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు.అందరితో స్నేహంగా ఉండాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు.
కుంభం
తలపెట్టినా ప్రయత్నం చేపట్టినా విజయవంతం. విదేశీయాన ప్రయత్నం సులభం. కుటుంబ కలహాలకు చోటివ్వరాదు. జీతభత్యాలు పెరిగే సూచనలు. మందకొడిగా వృత్తి, వ్యాపారాలు. ఆకస్మిక ధన నష్టం. పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. సొంత పనుల విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం
వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. గొప్పవారి పరిచయం జరుగుతుంది. స్త్రీల వళ్ల లాభం. ఉద్యోగంలో పనిభారం. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటారు.సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ.