Life style | యోని రింగ్‌ను యోనిలో ఎలా ధరిస్తారు.. అది గర్భం రాకుండా ఎలా నిరోధిస్తుంది..?
Life style | అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు ఎన్నో ఉత్పత్తులు సృష్టించబడ్డాయి. టాబ్లెట్‌లు, లూప్‌లు, కండోమ్స్ ఇలా రకరకాల ఉత్పత్తులు గర్భ నిరోధకాలుగా ఉపయోగపడుతున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకుని, ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకునే దంపతులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

Life style : అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు ఎన్నో ఉత్పత్తులు సృష్టించబడ్డాయి. టాబ్లెట్‌లు, లూప్‌లు, కండోమ్స్ ఇలా రకరకాల ఉత్పత్తులు గర్భ నిరోధకాలుగా ఉపయోగపడుతున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకుని, ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకునే దంపతులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా వినియోగించే గర్భ నిరోధకాల్లో ఇప్పుడు కొత్తగా యోని రింగ్ చేరింది. ఈ యోని రింగ్‌ను మహిళలు యోని లోపల ధరిస్తే గర్భం రాకుండా అడ్డుకుంటుందట. మరి ఈ యోని రింగ్‌ను ఎలా ధరిస్తారు..? అది గర్భ నిరోధకంగా ఎలా పనిచేస్తుంది..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యానికి ఏమాత్రం హానికరంకాని రబ్బర్‌తో ఈ యోనిరింగ్‌ల ఉత్పత్తి జరిగిందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. సెక్సాలజిస్టులు చెప్పిన ప్రకారం.. యోని రింగ్‌ను సరిగ్గా ధరిస్తేనే గర్భం రాకుండా ఉండేందుకు 99 శాతం అవకాశం ఉంటుంది. చిన్నగా, మెత్తగా ఉండే ఈ రింగ్‌ను యోనిలోపలికి వేలితో చొప్పిస్తే గర్భసంచి ముఖ ద్వారం వద్దకు చేరుతుంది. ఇది అవాంఛిత గర్భాన్ని నిరోధించడంలో గర్భనిరోధక మాత్రల మాదిరిగానే పనిచేస్తుంది. గర్భాన్ని నిరోధించే లైంగిక హార్మోన్‌ల విడుదలను ప్రేరేపిస్తుంది.
స్త్రీ శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే లైంగిక హార్మోన్‌లు విడుదలవుతాయి. ఈ హార్మోన్‌లు స్త్రీలలో లైంగిక వాంఛలను కలిగిస్తాయి. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ క్రమం తప్పకుండా విడుదల కావడంవల్ల అండం విడుదలకు ఆస్కారం ఉండదు. దాంతో అంత సులువుగా గర్భం వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ప్రొజెస్టెరాన్ యోనిలో ఉత్పత్తయ్యే ద్రవాల చిక్కదనాన్ని పెంచుతుంది. దాంతో వీర్య కణాలు ఆ ద్రవాలను దాటుకుని అండాన్ని చేరలేవు. ఈ విధంగా యోని రింగ్ మహిళల్లో అవాంఛిత గర్భం రాకుండా అడ్డుకుంటుంది.
ఈ యోని రింగ్‌ను ఒకసారి చొప్పిస్తే 21 రోజుల వరకు పనిచేస్తుంది. అంటే మూడు వారాల తర్వాత పీరియడ్స్‌కు ముందు ఈ రింగ్‌ను తొలగించాల్సి ఉంటుది. సరిగ్గా ఏడు రోజులు అంటే ఒక వారం గ్యాప్ ఇచ్చి మరో కొత్త రింగ్‌ను ధరించాలి. ఆ తర్వాత దాన్ని కూడా 21 రోజులు ఉంచుకుని తొలగించాలి. మరో వారం గ్యాప్ ఇవ్వాలి. గర్భం వద్దనుకున్నన్ని రోజులు ఇలాగే ఈ సైకిల్‌ను కొనసాగించాలి. ఈ వారం రోజుల గ్యాప్ గర్భాశయంలోని చెడు రక్తం బయటికి వెళ్లిపోయేందుకు తోడ్పడుతుంది.