ఆల్కహాల్ తీసుకునే వారికి కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ మానలేక ఎంతోమందిలో టెన్షన్, కుంగుబాటు, యాంగ్జైటీ డిసార్డర్ లాంటి మానసిక అవలక్షణాలు కూడా ఏర్పడతాయి. మందు మానేయం చాలా ఉత్తమం. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు దాటినవారు తప్పకుండా మానేసి తీరాలి.
ఆల్కహాల్ తీసుకునే వారికి కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ మానలేక ఎంతోమందిలో టెన్షన్, కుంగుబాటు, యాంగ్జైటీ డిసార్డర్ లాంటి మానసిక అవలక్షణాలు కూడా ఏర్పడతాయి. మందు మానేయం చాలా ఉత్తమం. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు దాటినవారు తప్పకుండా మానేసి తీరాలి.
ఆల్కహాల్ అలవాటు మానడం ఎలా?
ఈ మాట అంటే, ఆ.. చెప్పడం తేలికే. తాగితే తెలుస్తుందంటూ నిట్టూరుస్తుంటారు మందుబాబులు. కానీ, ఆల్కహాల్ వినియోగానికీ, కాలేయ ఆరోగ్యానికి దగ్గర సంబంధం ఉంది. ఎవరైతే ఆల్కహాల్‌ను అధికంగా తీసుకుంటారో వారి కాలేయం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కేవలం కాలేయ ఆరోగ్యాన్నే కాదు, ఇతర ప్రధాన అవయవాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది దాదాపు 200 రకాల ఆనారోగ్యాలకు మందు కారణమవుతోంది. . ముఖ్యంగా ఆల్కహాల్ సంబంధిత వ్యాధుల వల్ల ఏడాదికి ముప్పయి లక్షల మంది చనిపోతున్నారు. అంటే ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 5.3 శాతం కేవలం ఆల్కహాల్ కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక చిన్న వయస్సులో మరణాలు కూడా చాలావరకు ఆల్కహాల్ కారణంగానే జరుగుతున్నాయి. 29 నుండి 25 ఏళ్ల వయసు వారిలో 13.5శాతం మరణాలు ఆల్కహాల్ వల్లనే కావడం తీవ్ర ఆందోళనకర అంశం.
మన దేశంలో మద్యపాన సంబంధిత వ్యాధుల వల్ల, దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే మూడు శాతం కంటే ఎక్కువగా ఉంది. అందుకే ఆల్కహాల్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మద్యం మానలేక ఎంతోమంది ఆ దురలవాటును కొనసాగిస్తున్నారు. లివర్ సిరోసిస్ అనే అతి ప్రమాదకర వ్యాధికి మూలకారణం అతిమద్యపానం.
ఆల్కహాల్ వల్ల సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు ఆల్కహాల్ తాగుతున్నారు. దీనివల్ల ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆల్కహాల్ మన శరీరంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు అది పొట్ట, చిన్న పేగు గోడల ద్వారా రక్త ప్రవాహంలోకి కలిసిపోతుంది. అక్కడ నుంచి మెదడుకు చేరి కేంద్ర నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆల్కహాల్ పేగులను ఇబ్బంది పెడుతుంది. పొట్ట, పేగుల లైనింగ్‌ను పాడుచేస్తుంది. పొట్టలో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే శక్తిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల ఆల్కహాల్ తాగే వారిలో విటమిన్ బి12, ఫోలేట్ వంటివి క్రమంగా లోపిస్తాయి.
ఆల్కహాల్ మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆనందం, విశ్రాంతి వంటివి దొరకనివ్వదు. నిరాశ, ఆందోళన వంటి అవలక్షణాలను పెంచుతుంది. ఆత్మన్యూనతాభావం పెరిగిపోతుంది. మతిమరుపు ఎక్కువవుతుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి. దీనికి బానిసలైన వాళ్ళు పూర్తిగా మద్యపానాన్ని మానలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు మితంగా తాగడం అలవాటు చేసుకోవాలి.
మద్యం ఇలా తగ్గించుకోండి
రోజూ తాగే అలవాటు ఉన్నవారు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. రెండు రోజులకు ఒకసారి, ఆ తర్వాత మూడు రోజులకు ఒకసారి ఇలా మితంగా తాగడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత వారానికి ఒక్కసారి మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల మెలమెల్లగా శరీరం తననుతాను బాగుచేసుకోవడం మొదలుపెడుతుంది. తరచూ మీ మద్యపానం వల్ల మీ కుటుంబం పడుతున్న ఇబ్బందులు గుర్తుచేసుకోండి. ముఖ్యంగా మీ పిల్లలు. ఈ ఆలోచన మీలో అపరాధభావాన్ని పెంచి, ఆల్కహాల్‌పై విరక్తి కలిగే అవకాశముంటుంది.
ఆల్కహాల్ మీ శరీరానికి చేసే చేటు గురించి ముందుగా అర్థం చేసుకుంటే దానిపై మీకు కాస్త ఏవగింపు కలుగుతుంది. ఆల్కహాల్ పానీయాలను నేరుగా తాగకుండా. నీరు, ఇతర పానీయాలతో కలపండి. తాగే టైమ్‌ను కూడా బాగా పెంచండి. అంటే తక్కువ మందును ఎక్కువసేపు తాగడం.
విస్కీ, బ్రాందీ, రమ్ లాంటివి కాకుండా, తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే లైట్ బీర్, వైన్ వంటివి తాగడం మంచిది. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో కొంత హాని చేసినా… పూర్తి మద్యం తాగడం కన్నా, ఎంతోకొంత ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం, తాగేటప్పుడు పుష్కలంగా నీరును తాగండి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. శరీరం నుండి మందు వల్ల పేరుకునే విషపదార్థాలు కూడా బయటకి పోతాయి. దాంతో కాలేయంపై ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆల్కహాల్ తాగిన రోజు త్వరగా జీర్ణమయ్యే లైట్ ఫుడ్ తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. బరువు పెరగకుండా చూసుకోండి. ఈ పద్ధతుల వల్ల మందు మానేయలేకపోయినా, కొంతలో కొంత బెటర్. కానీ, మందు పూర్తిగా మానేయడం అన్నింటికన్నా బెటర్.