Better than America: ఆ ప‌ది విషయాల్లో అమెరికా కంటే భార‌త్ బెట‌ర్‌! తేల్చేసిన ఓ అమెరిక‌న్ యువ‌తి..

కొంత‌కాలంగా భార‌త్‌లో ఉంటున్న ఒక అమెరిక‌న్ యువ‌తి.. ఆ ప‌ది విష‌యాల్లో అమెరికా.. భార‌త్ త‌ర్వ‌తేన‌ని స్ప‌ష్టంచేసింది. ప‌ది అంశాల‌ను క‌వ‌ర్ చేస్తూ.. ఇవ‌న్నీ కూడా ఆమెరికాలో కూడా అందుబాటులోకి రావాల‌ని ఆమె ఆకాంక్షించారు. వీట‌న్నింటినీ అమెరిక‌న్లు మిస్ అవుతున్నార‌ని చెప్పారు.

Better than America: ఆ ప‌ది విషయాల్లో అమెరికా కంటే భార‌త్ బెట‌ర్‌! తేల్చేసిన ఓ అమెరిక‌న్ యువ‌తి..

Better than America: అమెరికా అంటే అనేక దేశాల వారికి క‌ల‌ల ప్ర‌పంచం. డాల‌ర్ల వేట‌లో అమెరికాకు స‌ర్దుకునే బ‌య‌ల్దేరేవారు. స‌రే ఇప్పుడంటే ట్రంప్ అంద‌రినీ వ‌డ‌క‌ట్టి మ‌రీ సంకెళ్లేసి ఇండియాకు పంపించేస్తున్నాడు.. అదే వేరే విష‌యం. అయితే.. ఇటీవ‌ల.. కొంత‌కాలంగా భార‌త్‌లో ఉంటున్న ఒక అమెరిక‌న్ యువ‌తి.. చేసిన ఒక‌ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అందులో ఆమె ఒక ప‌ది విష‌యాల్లో అమెరికా కంటే భార‌త‌దేశ‌మే గ్రేట్ అని తేల్చేసింది. ఆ ప‌ది విష‌యాల్లో అమెరికా.. భార‌త్ త‌ర్వ‌తేన‌ని స్ప‌ష్టంచేసింది. ఆమె పేరు క్రిస్టీన్ ఫిశ్చ‌ర్‌. నాలుగేళ్లుగా ఇండియాలోనే నివ‌సిస్తున్నారు. భార‌త‌దేశంలో డిజిట‌ల్ ఐడీలు, యూపీఐ చెల్లింపులే కాకుండా.. అత్యంత సుల‌భంగా డాక్ట‌ర్‌ను క‌లిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని పేర్కొంది. అంతేకాదు.. భార‌త‌దేశంలో ఆటోలో, రిక్షాలు, చెత్త సేక‌ర‌ణ విధానం సైతం ఆమెను ఆక‌ట్టుకున్నాయ‌ట‌. ఆటోల‌తో ట్రాన్స్‌పోర్ట్ ఫెసిటిలీ చాలా చీప్‌గా ల‌భిస్తుంద‌ని ఆమె తెలిపారు. మొత్తంగా ప‌ది అంశాల‌ను క‌వ‌ర్ చేస్తూ.. ఇవ‌న్నీ కూడా ఆమెరికాలో కూడా అందుబాటులోకి రావాల‌ని ఆమె ఆకాంక్షించారు. వీట‌న్నింటినీ అమెరిక‌న్లు మిస్ అవుతున్నార‌ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌గా మారింది. ఆమె పేర్కొన్న ప‌ది అంశాల్లో డిజిట‌ల్ ఐడీలు, యూపీఐ చెల్లింపులు టాప్‌లో ఉన్నాయి.

  • ఇదీ ఆ జాబితా..
  • డిజిట‌ల్ ఐడీలు, యూపీఐ ద్వారా డిజిట‌ల్ పేమెంట్లు అర్థ‌వంత‌మైన‌వి. అన్నింటినీ సుల‌భ‌త‌రం చేస్తున్నాయి. నేను జ‌స్ట్ ఒక ఫోన్ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వెళ్లితే చాలు. నా ఉద్దేశంలో.. యూపీఐ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచంలోని అన్ని దేశాలు ఫాలో అవ్వాలి.
  • ఆటోలు, రిక్షాలు భార‌త‌దేశంలో ప్ర‌తిచోటా ఉంటాయి. అవి చాలా చౌక‌గా దొరుకుతాయి. అంతేకాదు చుట్టుప‌క్క‌ల‌కు వెళ్లి రావ‌డానికి చాలా క‌న్వీనియంట్‌గా కూడా ఉంటాయి. నేను ప్ర‌తి రోజూ రిక్షాలు వాడుతాను. వాహ‌నాలు డ్రైవ్ చేయ‌డం, వాటిని ఎక్క‌డో పార్క్ చేయ‌డం వంటి స‌మ‌స్య‌లేమీ ఉండ‌వు.
  • ఇండియాలో డాక్ట‌ర్ల‌ను క‌నుగొన‌డం చాలా సుల‌భం. చాలా సంద‌ర్భాల్లో ముందుస్తు అపాయింట్‌మెంట్ ఏమీ అవ‌స‌రం లేదు. ప్రిస్క్రిప్ష‌న్స్ కూడా అవ‌స‌రం లేదు. అదే అమెరికాలో అయితే.. కొన్ని వారాలు, ఆ మాట‌కొస్తే కొన్ని నెల‌ల ముందే డాక్ట‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఢిల్లీలో ప్ర‌భుత్వ‌మే ఉచితంగా చెత్త‌ను తొల‌గిస్తుంటుంది.. ఇది చాలా గ్రేట్‌. చెత్త వేయండంటూ అంద‌రినీ పిలుస్తూ చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల్లో వ‌చ్చే పాట‌లు, అవి విని అంతా వ‌చ్చి చెత్త‌ను ఆ వాహ‌నంలో వేయ‌డం చూస్తే ముచ్చ‌టేస్తుంది. అమెరికాలో చెత్త సేక‌ర‌ణ స‌ర్వీసుపై చాలా శ్ర‌ద్ధ పెట్టాల్సి ఉంది.
  • నైపుణ్యం క‌లిగిన శ్ర‌మ‌శ‌క్తిని హైర్ చేసుకోవ‌డానికి, వారి స‌ర్వీసులు పొంద‌టానికి చాలా క‌న్వీనియంట్‌గా ఉంటుంది. ఇదే ప‌ని అమెరికాలో చేయాలంటే చాలా ఖ‌ర్చు, శ్ర‌మ‌తో కూడిన‌ది.
  • ఇండియాలో అనేక ర‌కాల వెజిటేరియ‌న్ ఫుడ్ ఆప్ష‌న్స్ ఉంటాయి. చాలా రెస్టారెంట్లు వెజిటేరియ‌న్ ఫుడ్ మాత్ర‌మే స‌ర్వ్ చేస్తాయి. మిగిలిన‌వాటిలో వెజిటేరియ‌న్ ఫుడ్ ఆప్ష‌న్లు ఇస్తారు. అదే అమెరికాలో అయితే వెజ్ ఆప్ష‌న్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కొన్ని చోట్ల అస‌లు వెజ్ ఫుడ్ అనేదే దొర‌క‌దు.
  • జంక్ మెయిల్స్ లేక‌పోవ‌డం ఇండియాలో చాలా గ్రేట్‌. అమెరికాతో పోల్చితే ప‌నికిమాలిన మెయిల్స్ చాలా త‌క్కువ వ‌స్తుంటాయి. అమెరికాలో రోజూ ప‌నికిమాలిన మెయిల్స్‌తో తంటాలే.
  • ఇండియాకు మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు గ‌ట్ ప్రాబ్లంతో డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న యాంటిబ‌యాటిక్స్‌తోపాటు ప్రోబ‌యాటిక్ కూడా ఇవ్వ‌డం అర్థ‌వంతంగా అనిపించింది.
  • ఎమ్మార్పీ లేదా మ్యాగ్జిమ‌మ్ రిటైల్ ప్రైస్ ఇండియాలో మ‌రో సూప‌ర్ క‌న్వీనియంట్ విష‌యం. మీరు ఎక్క‌డికి వెళ్లిన ఏదైనా స‌రుకు ఎంత‌కు దొర‌కుతుందో తెలిసిపోతుంది. సంబంధిత ప్రొడ‌క్ట్ మీద అది ప్రింట్ చేసి ఉంటుంది. అమెరికాలో ఆ యా ఉత్ప‌త్తుల‌పై అమ్మేవాళ్లు చెప్పేదే ధ‌ర‌. లేబుల్ మీద అది ప్రింట్ అయి ఉండ‌దు.
  • డెలివ‌రీ యాప్స్ ఇండియాలో మ‌రో అత్యంత క‌న్వీనియంట్ థింగ్స్‌లో ఒక‌టి. మీరు ఆర్డ‌ర్ ఇచ్చిన‌వాటిని నిమిషాల్లో మీ ఇంటికి డోర్ డెలివ‌రీ చేసే యాప్స్ ప‌ది ప‌న్నెండుకుపైగా ఉన్నాయి. అవును.. మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే.. నిమిషాల్లోనే..

ఈమె పెట్టిన వీడియోపై నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. కొంద‌రు ఆమె చెప్పిన పాయింట్ల‌ను అంగీక‌రిస్తే.. మ‌రికొంద‌రు.. కొన్ని స‌వాళ్ల‌ను మాత్రం ఆమె పేర్కొన‌లేద‌న్నారు. క్రిస్టీన్ ఫిశ్చ‌ర్ 2021లో భార‌త్‌కు వ‌చ్చారు. ఆమెకు భ‌ర్త‌, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీలో క్రిస్టీన్ ప‌నిచేస్తున్నారు.