Maharashtra | 12 మంది మావోయిస్టుల హతం.. భారీగా ఆయుధాలు లభ్యం
మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే

విధాత, హైదరాబాద్ : మహారాష్ట్రలో గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందడం విదితమే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు సైతం గాయాలయ్యాయి. అయితే ఎన్‌కౌంటర్ అనంతరం మహారాష్ట్ర, చత్తీస్‌ఘఢ్ సరిహద్దులోని వందోలి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులకు భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్‌కౌంటర్ మృతుల్లో తిప్పగడ్డ దళ కమాండర్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ దళాలకు 50లక్షల బహుమతి ప్రకటించారు