Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల్లో నిరక్ష్యరాసులు పోటీ..! ఆ 121 మందిలో పార్లమెంట్ గడప తొక్కెదేవరో..?
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు జరిగాయి. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఆరు, ఏడు దశల ఎన్నికలు మే 25, జూన్ 1వ తేదీన జరగనున్నాయి.

Lok Sabha Elections | న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు జరిగాయి. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన ఆరు, ఏడు దశల ఎన్నికలు మే 25, జూన్ 1వ తేదీన జరగనున్నాయి.
మొత్తం 543 స్థానాలకు గానూ 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 8,837 మంది అభ్యర్థుల విద్యా అర్హతలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 121 మంది నిరక్ష్యరాసులు పోటీలో ఉన్నట్లు తెలిపింది. 359 మంది అభ్యర్థులు ఐదో తరగతి వరకు మాత్రమే చదివినట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 8వ తరగతి వరకు చదివిన వారు.. 647 మంది ఉన్నట్లు తెలిపారు. 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి వరకు, 1,502 మంది అభ్యర్థులు డిగ్రీ వరకు చదివినట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 198 మంది అభ్యర్థులు డాక్టరేట్లు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు.. జూన్ 1వ తేదీన ముగియనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి, బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ ఉంది. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.