IVF | 10 సార్లు ఐవీఎఫ్ విఫ‌లం.. 11వ సారి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌

ఇది వైద్య చ‌రిత్ర‌లోనే అద్భుతం. ఓ 33 ఏండ్ల మ‌హిళ‌కు సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిని ఫాలో అయింది. ఒక‌ట్రెండు సార్లు కాదు.. ఏకంగా 10 సార్లు ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో పిల్ల‌ల‌ను క‌నేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది. ఇక 11వ సారి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అదే ఐవీఎఫ్ విజ‌య‌వంత‌మైంది.. పండంటి క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది ఆవిడ‌.

IVF | 10 సార్లు ఐవీఎఫ్ విఫ‌లం.. 11వ సారి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌

న్యూఢిల్లీ : ఇది వైద్య చ‌రిత్ర‌లోనే అద్భుతం. ఓ 33 ఏండ్ల మ‌హిళ‌కు సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిని ఫాలో అయింది. ఒక‌ట్రెండు సార్లు కాదు.. ఏకంగా 10 సార్లు ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో పిల్ల‌ల‌ను క‌నేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది. ఇక 11వ సారి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అదే ఐవీఎఫ్ విజ‌య‌వంత‌మైంది.. పండంటి క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది ఆవిడ‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని వార‌ణాసికి చెందిన 33 ఏండ్ల మ‌హిళ‌కు కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. కానీ ఆమెకు సంతానం క‌ల‌గ‌లేదు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప‌రిధిలో ఉన్న అనేక మంది గైన‌కాల‌జిస్టుల‌ను సంప్ర‌దించింది. సంతానోత్ప‌త్తికి సంబంధించిన హార్మోన్లు ఇద్ద‌రిలోనూ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ క్ర‌మంలో ఆ దంప‌తుల‌కు వైద్యులు ఐవీఎఫ్ గురించి వివ‌రించారు. దీంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో వారు పిల్ల‌ల‌ను క‌నేందుకు ప్ర‌య‌త్నించారు. అలా ప‌ది సార్లు ప్ర‌య‌త్నించ‌గా, ఏ ఒక్క‌సారి కూడా స‌క్సెస్ కాలేదు. ఆ దంప‌తుల జీవ‌నశైలిలో మార్పులు చేసుకోవాల‌ని వైద్యులు సూచించారు. మెడికేష‌న్ ప్రారంభించారు. చివ‌ర‌కు ఎరా టెస్టింగ్ ద్వారా ఆమెలో ఇంప్లాంటేష‌న్‌కు సంబంధించిన‌ గ‌ర్భాశ‌య కుహ‌రాన్ని క‌నుగొన్నారు. ఆమె భ‌ర్త‌కు కూడా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్ష‌న్ ఇచ్చారు. ఎరా టెస్టింగ్ ప్ర‌కారం.. స్పెర్మ్, అండాశ‌యాన్ని క‌లిపారు. ఈ ప్ర‌క్రియ జ‌రిగిన 15 రోజుల త‌ర్వాత రోగి గ‌ర్భం దాల్చిన‌ట్లు ప‌రీక్ష‌లో తేలింది. చివ‌ర‌కు ఆమె క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.