Anxiety | గ్రామీణ భారతంలో 45శాతం మందిలో మానసిక ఆరోగ్య సమస్యలు..!

Anxiety | గ్రామీణ భారతంలోని 45శాతం మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 73శాతం గ్రామీణ కుటుంబాల్లో వృద్ధులు ఉన్నారు. వారికి నిరంతరం సంరక్షణ అవసరం ఉన్నది. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌ఫార్మ్‌ రూరల్‌ ఇండియా (TRI) స్టేట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా-2024 నివేదిక నాల్గో ఎడిషన్‌ సంరక్షణ బాధ్యతలు ఎక్కువగా మహిళలపై ఉన్నాయని వెల్లడించింది.

Anxiety | గ్రామీణ భారతంలో 45శాతం మందిలో మానసిక ఆరోగ్య సమస్యలు..!

Anxiety | గ్రామీణ భారతంలోని 45శాతం మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 73శాతం గ్రామీణ కుటుంబాల్లో వృద్ధులు ఉన్నారు. వారికి నిరంతరం సంరక్షణ అవసరం ఉన్నది. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌ఫార్మ్‌ రూరల్‌ ఇండియా (TRI) స్టేట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌ రూరల్‌ ఇండియా-2024 నివేదిక నాల్గో ఎడిషన్‌ సంరక్షణ బాధ్యతలు ఎక్కువగా మహిళలపై ఉన్నాయని వెల్లడించింది. భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం కుటుంబాలు మాత్రమే పెయిడ్ కేర్ సేవలను ఎంచుకోగలుగుతున్నాయని.. ఇది ఆరోగ్య సంరక్షణ రంగంలో పెద్ద అంతరాన్ని తెస్తుందని పేర్కొంది. 21 రాష్ట్రాలకు చెందిన 5,389 కుటుంబాలతో నిర్వహించిన ఈ సర్వేలో 72.1 శాతం మంది మహిళలు వృద్ధుల బాగోగులు చూసుకుంటున్నారని తేలింది. కేవలం 3శాతం కుటుంబాలను మాత్రమే వృద్ధుల బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్‌ టేకర్‌ను నియమించుకోగలుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సమస్యలు (Anxiety) కూడా పెరుగుతున్నాయి. అన్ని లింగాల (Genders)కు చెందినవారు 45 శాతం మంది ఆందోళన సమస్యలతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. ఇది సమగ్ర సమగ్ర మద్దతు వ్యవస్థల అవసరాన్ని చూపుతుందని డేటా పేర్కొంది. అలాగే, 60శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు, వారి కుటుంబంలోని ఇతర సభ్యులకు ఎలాంటి జీవిత బీమా కవరేజీ లేదని నివేదిక పేర్కొంది. పరిమిత రోగనిర్ధారణ సౌకర్యాలు, సరసమైన మందులు సులభంగా దొరకడంలోనూ సవాళ్లు కొనసాగుతున్నాయి. 12.2శాతం మందికి మాత్రమే సబ్సిడీతో కూడిన మందులు అందుబాటులో ఉన్నాయి. 21శాతం మందికి సమీప ప్రాంతంలో మెడికల్‌ స్టోర్‌ సైతం లేదు. సర్వేలో స్పందించిన 50శాతం మందిలో తాము పొలాల్లో పని చేయడం ద్వారా శారీరక శ్రమ జరగడంతో ఫిట్‌గా ఉన్నట్లు పలువురు రిప్రజెంటర్లు తెలిపారు. దాంతో వారు అదనంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని నివేదిక తెలిపింది. కేవలం 10శాతం మంది మాత్రమే యోగా, ఇతర ఫిట్‌నెస్‌ కార్యకలాపాలు చేసేందుకు అంగీకరించారు.

సర్వే ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరు తమ గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదని, 23శాతం మంది మాత్రమే కవర్ డ్రైనేజీ నెట్‌వర్క్ కలిగి ఉన్నారని చెప్పారు. 43శాతం ఇళ్లలో శాస్త్రీయ వ్యర్థాలను పారవేసే వ్యవస్థ లేదని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నట్లుగా వివరించారు. నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (NHSRC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మేజర్ జనరల్ ప్రొఫెసర్‌ అతుల్ కొత్వాల్ స్పందిస్తూ ఆరోగ్య ప్రణాళికలో కమ్యూనిటీ, బిహేవియరల్ డైనమిక్‌లను సమగ్రపరచడం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థలో ఆశావర్కర్లు, సీహెచ్‌ఓలవంటి ప్రొవైడర్లు ఉన్నప్పటికీ పొరుగు సంరక్షణను మెరుగుపరిచేందుకు మరింత సమర్థవంతమైన సహకారం అవసరమన్నారు. గ్రామీణ వర్గాలలోని వ్యక్తులు మరియు కుటుంబాలకు మెరుగైన మద్దతునిచ్చేందుకు స్థానిక నాయకులు, స్వయం సహాయక బృందాలు, సేవలు చేసే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యాన్ని నివేదిక హైలెట్‌ చేసింది. అయితే, ఈ సపోర్ట్‌గా మెరుగ్గా నిర్వహించబడాలని.. సమర్థవంతమైన సహాయాన్ని నిర్ధారించేందుకు స్థానిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు పని చేయాలని పరిశోధకులు నివేదికలో సూచించారు.