Mohammad Ayaz | బాలికలంటే అతనికి మోజు.. ఇంకేముంది.. తనకు నచ్చిన అమ్మాయితో మాటలు కలిపి లైంగిక వేధింపులకు గురిచేయడం అలవాటుగా మారింది. అలా ఒకరిద్దరిని కాదు.. ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. అంతేకాదు 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. మరి ఆ క్రూరమృగం వయసు ఎంతంటే కేవలం 19 ఏండ్లే.
మహారాష్ట్రలోని పరట్వాడా సిటీకి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్(19) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. వాట్సాప్, స్నాప్ చాట్ గ్రూపులను క్రియేట్ చేసి.. బాలికలను టార్గెట్ చేసేవాడు. వారికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యేవాడు. ఆ తర్వాత బాలికలను ముంబై, పుణెలోని హోటల్స్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. వారికి తెలియకుండానే వీడియోలను చిత్రీకరించేవాడు. ఇక ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. అయితే వీరిలో కొంతమంది అమ్మాయిలను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో అతని ఆగడాలు భరించలేని బాలికలు రాజ్యసభ బీజేపీ ఎంపీ అనిల్ బోండేకు తమకు జరిగిన అన్యాయంపై వివరించారు.
బీజేపీ ఎంపీ అనిల్.. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని ఎంపీ హెచ్చరించారు. దీంతో నిందితుడు అయాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. నిందితుడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందలకొద్దీ అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలను తొలగించే చర్యలు చేపట్టారు.
