Dog vs Cobra | రియల్ హీరో ఈ శునకమే.. బుసలు కొడుతున్న నాగుపామును నేలకేసి కొట్టింది.. వీడియో
Dog vs Cobra | కుక్క( Dog ) అంటేనే విశ్వాసానికి మారు పేరు. ఏ కుక్క అయినా సరే ఒక్కసారి తన యజమాని నమ్మితే.. ఆయనకు ఏ ఆపద వచ్చినా.. వెన్నంటి ఉంటుంది. తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తన యజమాని పిల్లలపైకి బుసలు కొడుతూ వచ్చిన ఓ నాగుపాము( King Cobra )ను నేలకేసి కొట్టింది ఓ శునకం.

Dog vs Cobra | చాలా మంది కుక్కల( Dog )ను పెంచుకుంటారు. ఎందుకంటే అవి యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి యజమానితో పాటు వారి కుటుంబ సభ్యులను కాపాడుతాయి. ఆ మాదిరిగానే ఓ పిట్ బుల్( Pit Bull ) కుక్క నాగుపాము( King Cobra )పై వీరోచిత పోరాటం చేసి.. యజమాని పిల్లలను ప్రాణాలతో కాపాడింది. కేవలం 18 సెకన్లలోనే కింగ్ కోబ్రాను కుక్క మట్టి కరిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) ఝాన్సీలోని శ్రీ గణేశ్ కాలనీలో ఓ కుటుంబం( Family ) నివాసం ఉంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న పచ్చిక మీద పిల్లలు ఆడుకుంటున్నారు. ఓ మూల నుంచి భారీ పొడవున్న ఓ నాగుపాము( King Cobra ) బుసలు కొడుతూ పిల్లలపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడే ఉన్న పిట్ బుల్( Pit Bull ) అప్రమత్తమైంది. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి.. నాగుపాముపై పోరాడింది. పడగ విప్పి దాడికి సిద్దమైన కింగ్ కోబ్రాను నోటితో పట్టుకున్న కుక్క.. కేవలం 18 సెకన్లలో దాన్ని మట్టి కరిపించింది. చివరకు ఆ నాగుపాము ప్రాణాలు విడిచింది.
శునకం వీరోచిత పోరాటంపై నెటిజన్లు( Netizens ) ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యజమాని పిల్లల పట్ల చూపించిన విశ్వాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి శునకం ఉంటే చాలు.. ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనైనా ప్రాణాలతో బయటపడొచ్చని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
झांसी से एक वीडियो वायरल हुआ है, जहां पिटबुल और कोबरा की खतरनाक लड़ाई हो रही है।
गार्डन में कुछ बच्चे खेल रहे थे. #पिटबुल की नजर कोबरा पर पड़ी तो उसने अपने दांतों से रस्सी को काटा और कोबरा से भिड़ गया. पिटबुल ने कोबरा को अपने मुंह में दबाया और जमीन पर पटक-पटकर उसे मार डाला। pic.twitter.com/bNbPJnGQX8
— Vishal Singh 🇮🇳 (@vishal_rajput01) September 24, 2024