విధాత : అంటుకట్టే పద్దతిలో అద్బుతాన్ని సృష్టించారు లక్నోలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రోపికల్ హార్టికల్చర్ (CISH) శాస్త్రవేత్తలు. 50 ఏళ్ల వయసున్న ఒకే మామిడి చెట్టుకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టడం) పద్ధతిలో ఏకంగా 234 రకాల మామిడి పండ్లను పండించి అరుదైన ఘనత సాధించారు.
తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ చెట్టును(మల్టీ-వెరైటీ/ఆల్-ఇన్-వన్ మామిడి చెట్టు) పరిశీలించి శాస్త్రవేత్తలను అభినందించారు. ఒకే చెట్టుకు కాసిన పండ్లలో దశేరి, తోతాపురి, లాంగ్డా, చౌసా, సఫేదా, బంగినపల్లి, మల్లికా, అమ్రపాలి, కేసరీ, అల్ఫాన్సో వంటి ఎన్నో రకాల మామిడి పండ్లున్నాయి. నిజంగా ఇది ఒక అద్బుతం అని శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానంతో ఏదైన సాధ్యమని శాస్త్రవేత్తలు నిరూపించారని, వారి పరిశోధనలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు, సాంకేతిక విస్తరణకు, పంటలు, తోటల సాగులను లాభాదాయకంగా మార్చేందుకు బాటలు వేస్తున్నాయని అభినందించారు. రైతులు ఆధునిక సేధ్య పద్దతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవాలని సూచించారు.
The Mango Universe
एक पेड़ और 234 वैरायटी
विचित्र है, किंतु सत्य है।
📍ICAR – केंद्रीय उपोष्ण बागवानी संस्थान (CISH), लखनऊ pic.twitter.com/MVvTY301hi
— Office of Shivraj (@OfficeofSSC) May 7, 2026
