చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌

త్తీస్‌గఢ్‌లోని నారాయ‌ణ‌పుర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక భద్రతా సిబ్బంది కూడా చనిపోయారని.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.

చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌

8మంది మావోయిస్టుల మృతి
దండకారణ్యంతలో కాగర్ చిచ్చు

విధాత : చత్తీస్‌గఢ్‌లోని నారాయ‌ణ‌పుర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక భద్రతా సిబ్బంది కూడా చనిపోయారని.. ఇద్దరు జవాన్లు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్రతా ద‌ళాలు చేపట్టిన యాంటీ న‌క్సల్ ఆప‌రేష‌న్ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ అడ‌వుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంట‌ర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. వరుస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం వార్‌ జోన్‌గా మారింది.

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అబూజ్‌మడ్ అడవులే టార్గెట్‌గా భద్రతా బలగాలు జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో 10 మంది, శనివారం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మృతి చెందారు. ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్‌లతో బాంబింగ్ చేస్తున్నారని, మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీలను హతమారుస్తున్నారని తాజాగా మావోయిస్టులు తమ లేఖ ఆరోపించారు.