కుల్గామ్‌లో రెండోరోజుకు సెర్చ్ ఆపరేషన్
జమ్ము కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నది. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

- నెహమాలో గురువారం మొదలైన కాల్పులు
- ఉగ్రవాదులు తప్పించుకోకుండా గట్టి చర్యలు
విధాత: జమ్ము కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నది. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా దళాలు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. కుల్గామ్‌లోని నెహమా ప్రాంతంలోని సామ్నో వద్ద శుక్రవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.
కుల్గామ్‌లోని నెహమా గ్రామంలో గురువారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు నక్కి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎదురుకాల్పులుగా మారిందని పేర్కొన్నారు.
ఉగ్రవాదులు చిక్కుకున్న ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు గట్టి వలయాన్ని నిర్వహించాయి. రాత్రిపూట ఆపరేషన్‌ను నిలిపివేసి, శుక్రవారం ఉదయం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే, ఇప్పటి వరకు ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదిక అందలేదని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.