Spurious Liquor | కాటేసిన కల్తీ మద్యం.. ఐదు గ్రామాల్లో 14 మంది మృతి
Spurious Liquor | కల్తీ మద్యం( Spurious Liquor ) కాటేసింది. ఐదు గ్రామాల్లో 14 మంది మృతి చెందారు. ఈ ఘటన పంజాబ్( Punjab )లోని అమృత్‌సర్( Amritsar )లో చోటు చేసుకుంది.

Spurious Liquor | కల్తీ మద్యం( Spurious Liquor ) కాటేసింది. ఐదు గ్రామాల్లో 14 మంది మృతి చెందారు. ఈ ఘటన పంజాబ్( Punjab )లోని అమృత్‌సర్( Amritsar )లో చోటు చేసుకుంది.
అమృత్‌సర్ పరిధిలోని భంగాలి, పాటల్‌పురి, మరై కలాన్, దేర్‌వాల్, తల్వాండి గుహ్‌మన్ గ్రామాలకు చెందిన కొందరు కల్తీ మద్యం సేవించారు. ఆ తర్వాత వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స పొందుతూ 14 మంది ప్రాణాలు విడిచారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై అమృత్‌సర్ డిప్యూటి కమిషనర్ సాక్షి సవాహ్నే మాట్లాడుతూ.. 14 మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఐదు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.