ప్రేమికులు జంటగా ఎక్కువసేపు గడపాలా? ఈ టిప్‌ పాటిస్తే చాలు!

ప్రేమికులు లేదా డేటింగ్‌లో ఉన్నవారు ఎక్కువసేపు కలిసి ఉండే అవకాశాలు లేవు! ఇక మాట్లాడుకోవడం అనేది పెద్ద సమస్యే! ఇలాంటి వారికి బెంగళూరు మహిళ ఒక సలహా ఇచ్చింది

ప్రేమికులు జంటగా ఎక్కువసేపు గడపాలా? ఈ టిప్‌ పాటిస్తే చాలు!

ఈ బిజీ ప్రపంచంలో భార్యాభర్తలు, ప్రేమికులు లేదా డేటింగ్‌లో ఉన్నవారు ఎక్కువసేపు కలిసి ఉండే అవకాశాలు లేవు! ఇక మాట్లాడుకోవడం అనేది పెద్ద సమస్యే! ఇలాంటి వారికి బెంగళూరు మహిళ ఒక సలహా ఇచ్చింది. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నది. ఆమె ఇచ్చిన సలహా ఏంటంటే.. ముందుగా ఒక చోట టైమ్‌కి కలుసుకుని.. అక్కడినుంచి మీ ఫేవరెట్‌ ప్లేస్‌కు అలా కారులో మాట్లాడుకుంటూ వెళ్లటమే వెళ్లే సమయంలో ఇష్టాయిష్టాలు, కోపతాపాలను చర్చించుకోవచ్చినేది ఆమె సలహా! ఇదేం సలహా అనుకుంటున్నారా? ఇందులో కొంత వెటకారమూ ఉన్నది. అదే బెంగళూరు ట్రాఫిక్‌ సమస్య. ట్రాఫిక్‌ జామ్‌లకు బెంగళూరు పెట్టింది పేరు. ఇక్కడి ట్రాఫిక్‌ కష్టాల గురించి తరచూ ఎవరో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తమ అనుభవాలను, ఇబ్బందులను పంచుకుంటూ ఉంటారు. బెంగళూరు ట్రాఫిక్‌ ఎంత భయానకంగా ఉంటుందో చెబుతూ ఆమె ఈ డేటింగ్‌ టిప్‌ ఇచ్చారు. ‘సమయానికి ఒక చోట కలుసుకుని ఇష్టమైన ప్రదేశానికి పీక్‌ ట్రాఫిక్‌లో బయల్దేరండి. ఆలాగైతే ఎక్కువ సమయం కలిసి గడిపేందుకు, ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చించుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు తలో విధంగా స్పందించారు. ఇది నిజంగా పెద్ద పరీక్షే.. ట్రాఫిక్‌లో ఎలా కలిసి ఉండగలం? అని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. కార్‌పూలింగ్‌ యాప్స్‌ గతంలో సమర్థవంతమైన డేటింగ్‌ యాప్స్‌గా ఉండేవి. కానీ.. దురదృష్టవశాత్తూ వాటిని బ్యాన్‌ చేశారు’ అని మరొకరు స్పందించారు. ఇది నిజంగా గొప్ప సలహా అని ఇంకొకరు ప్రశంసించారు. ‘కేవలం డేటింగ్‌ కోసమే. పెళ్లయినవారికి వర్తించదు/ మంచిదికాదు’ అని ఒకరు కామెంట్‌ చేశారు. గతంలో కూడా బెంగళూరు ట్రాఫిక్‌ గురించి ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు. ట్రాఫిక్‌ జామ్‌ను తాను ఎంత గొప్పగా ఉపయోగించుకుంటున్నది, తన పనులు కారులోనే ఎలా చక్కబెట్టుకుంటున్నదీ ఫొటోలతో సహా వివరించారు. ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోల్లో.. కూరగాయల సంచులు ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లో ఆగిపోయినప్పుడల్లా ఆమె వాటిని చక్కగా తోలు తీసి, ముక్కలు చేసి వేరే బ్యాగులో సర్దేశారు. ఒక ఫొటోలో ఆమె బటానీ గింజలను వేరు చేసి వేరొక పాలిథిన్‌ కవర్‌లో ఉంచడం కనిపిస్తున్నది. ‘బాగా ట్రాఫిక్‌ ఉన్న సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం’ అని ఆమె ఆ ఫొటోలకు క్యాప్షన్‌ పెట్టారు.