CM Revanth Reddy| హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా మార్చాలి
హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు
cm-revanthreddy
CM Revanth Reddy
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలి సూచించారు. హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రటరీ మాణిక్ రాజ్, MA&UD (HMDA Area) సెక్రటరీ ఇలంబర్తి, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ RV కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, FCDA కమిషనర్ కే.శశాంక, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, MRDCL ఎండీ EV నర్సింహ రెడ్డి, జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram