New ATM Rules 2026 : రేపటి నుంచి ఏటీఎం యూజర్స్ చార్జీలలో కొత్త నిబంధనలు

ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. విత్‌డ్రా పరిమితి తగ్గింపు, కొత్త ఫీజులతో ఖాతాదారులకు అదనపు భారం పడనుంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 31, 2026, 5:55 pm IST
Read Time: 3 mins
New ATM Rules 2026 : రేపటి నుంచి ఏటీఎం యూజర్స్ చార్జీలలో కొత్త నిబంధనలు

విధాత : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో, బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో బ్యాంకులు తమ ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్నాయి.

ఏటీఎంలలో కార్డ్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నాయి. ఇక నుంచి ప్రతి లావాదేవీకి 23 రూపాయల వరకు ఛార్జీ వసూలు చేయడంతో పాటు, దానికి అదనంగా వర్తించే పన్నులను కూడా ఖాతాదారులే భరించాల్సి ఉంటుంది. HDFC సహా పలు ఇతర బ్యాంకుల నిబంధనలలో మార్పులు చేశాయి.

అలాగే.. ఛార్జీల పెంపు మాత్రమే కాకుండా, డెబిట్ కార్డుల ద్వారా రోజువారీ నగదు విత్ డ్రా చేసుకునే పరిమితిని కూడా బ్యాంకులు భారీగా తగ్గించాయి. డెబిట్ కార్డులపై రోజువారీ విత్ డ్రా పరిమితి సగానికి కుదించారు. నాన్-ఫైనాన్షియల్ (బ్యాలెన్స్ చెక్ వంటివి) రూ.10 వసూలు చేయబోతున్నారు. అకౌంట్‌లో తగినంత డబ్బు లేక ట్రాన్సాక్షన్ విఫలమైతే రూ.25 జరిమానా విధిస్తారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు బ్యాంకులు చెబుతున్నన్నప్పటికి.. అత్యవసర సమయాల్లో నగదు కావాలనుకునే వారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా వినియోగదారులు తమ నగదు అవసరాలను తీర్చుకునే ప్రణాళికలు సిద్దం చేసుకుంటే ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Golden Toilet Suclpture | ట్రంప్ పై అమెరికన్ల ‘గోల్డెన్ టాయిలెట్’ సెటైర్లు
Chicken Shops Bandh In TG | తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్