శునకాన్ని ఉరి తీసి చంపిన దుండగులు

శునకాన్ని ఉరి తీసి చంపిన దుండగులు

విధాత : తమ పెంపుడు కుక్కకు శిక్షణ ఇవ్వాలని ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు కుక్కను అప్పగిస్తే వారు దాన్ని ఉరి తీసి చంపిన వైనం వెలుగుచూసింది. భోపాల్ ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో నీలేశ్ జైస్వాల్ అనే వ్యక్తి తన శునకాన్ని ట్రైనింగ్‌ కోసం ఇచ్చారు.


కొద్దిరోజులకు అది చనిపోయింది. మంచి ఆరోగ్యంతో ధృడంగా ఉండే తన కుక్క ఎలా చనిపోయిందన్న అనుమానంతో జైస్వాల్‌ పోలీస్‌ కంప్లైంట్ ఇచ్చారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా, ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఆ శునకాన్ని ఉరి తీసి చంపిన ఘటన వెలుగుచూసింది.