Sinduri | ఆ బిడ్డ పేరు ‘సిందూరి’.. ప్రత్యేకత ఇదే..!
Sinduri | ప్రత్యేక సందర్భాల్లో పుట్టిన బిడ్డలకు.. ఆ సందర్భానికి అనుగుణంగా వారి పేర్లను నామకరణం చేస్తుంటారు. ఎందుకంటే అలాంటి పేర్లు చరిత్రలో గుర్తుండి పోతాయి కాబట్టి. ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) రోజే పుట్టిన ఓ బిడ్డకు ఆమె తల్లిదండ్రులు 'సిందూరి'( Sinduri ) అని నామకరణం చేశారు.

Sinduri | ప్రత్యేక సందర్భాల్లో పుట్టిన బిడ్డలకు.. ఆ సందర్భానికి అనుగుణంగా వారి పేర్లను నామకరణం చేస్తుంటారు. ఎందుకంటే అలాంటి పేర్లు చరిత్రలో గుర్తుండి పోతాయి కాబట్టి. ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) రోజే పుట్టిన ఓ బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ‘సిందూరి'( Sinduri ) అని నామకరణం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ రోజే తమ బిడ్డ జన్మించడం సంతోషంగా ఉందని సంతోష్ మండల్, రాఖీ కుమారి అనే దంపతులు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి.. పాక్‌పై విజయం సాధించిన రోజే తమ ఇంట్లో కూతురు జన్మించడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. అందుకే ఆ పసిపాపకు సిందూరి అని నామకరణం చేసినట్లు తెలిపారు. సిందూరి అని పేరు పెట్టడం తమకు గర్వంగా ఉందన్నారు ఆ దంపతులు.
బీహార్ కతిహార్ జిల్లాలోని బల్లి మహేశ్‌పూర్ గ్రామానికి చెందిన ఈ దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బిడ్డకు సిందూరి అనే పేరు పెట్టడం, ఈ విధంగా దేశభక్తిని చాటుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు.