Bijapur Encounter| బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్..12మంది మావోయిస్టుల మృతి
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు హతమయ్యారు. కొంటా కిస్సారం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కొంటా ఏరియా మావోయిస్టు కమిటీ పూర్తి హతమైంది.
విధాత : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ (Bijapur Encounter)లో 12మంది మావోయిస్టులు హతమయ్యారు. కొంటా కిస్సారం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కొంటా ఏరియా మావోయిస్టు కమిటీ పూర్తి హతమైంది. మృతుల్లో కమిటీ సభ్యుడు సచిన్ మగ్దూ కూడా ఉన్నారు. ఘటన స్థలంలో 3ఏకే 47తపాకులు సహా భారీగా ఆయుధాల్సి స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31 దగ్గర పడుతుండటంతో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు గాలింపు ముమ్మురం చేశాయి. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు కొంటా కిస్సారం అడవుల్లో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంకోవైపు మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్థానంలో నియామితులైన పార్టీ మిలటరీ చీఫ్ దేవా బర్సా తన మిలటరీ బృందం 20మంది మావోయిస్టులతో కలిసి శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నట్లుగా సమాచారం. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టు పార్టీ బలం అంతిమ దశకు చేరుకుంటుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram