ఢిల్లీలో 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు నోయిడా ప‌రిధిలో ఉన్న ఓ 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ బాంబు బెదిరింపులు ఈమెయిల్స్ ద్వారా వ‌చ్చిన‌ట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆయా పాఠ‌శాల‌ల్లోని పిల్ల‌ల‌ను వారి నివాసాల‌కు పంపించేశారు.

ఢిల్లీలో 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు నోయిడా ప‌రిధిలో ఉన్న ఓ 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. ఈ బాంబు బెదిరింపులు ఈమెయిల్స్ ద్వారా వ‌చ్చిన‌ట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆయా పాఠ‌శాల‌ల్లోని పిల్ల‌ల‌ను వారి నివాసాల‌కు పంపించేశారు.

ద్వార‌క‌, వ‌సంత్ కుంజ్‌లోని ఢిల్లీ ప‌బ్లిక్ స్కూళ్ల‌కు, ఈస్ట్ మ‌యూర్ విహార్‌లోని మ‌ద‌ర్ మేరీ స్కూల్‌కు, పుష్ప విహార్‌లోని సంస్కృతి స్కూల్, అమితి స్కూల్‌కు, సౌత్ వెస్ట్ ఢిల్లీలోని డీఏవీ స్కూల్‌తో పాటు ప‌లు పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. నోయిడాలోని డీపీఎస్ స్కూల్ కూడా బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌ని తెలిపారు పోలీసులు.

బాంబు బెదిరింపులు వ‌చ్చిన పాఠ‌శాల‌ల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ స్కూళ్ల‌ల్లోని పిల్ల‌ల‌ను సుర‌క్షితంగా వారి ఇండ్ల‌కు పంపించేశారు. పాఠ‌శాల‌ల‌ను పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. ద్వార‌కాలోని డీపీఎస్‌కు ఇవాళ ఉద‌యం 6 గంట‌ల‌కు బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. బాంబు బెదిరింపుల నేప‌థ్యంలో బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్, అగ్నిమాప‌క సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై డీపీఎస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. విస్తృత త‌నిఖీల త‌ర్వాత ద్వారకా డీపీఎస్‌లో ఎలాంటి బాంబులు ల‌భ్యం కాలేద‌ని తేలింది. మ‌ద‌ర్ మేరీ స్కూల్, సంస్కృతి స్కూల్, అమితి స్కూల్, డీపీఎస్ నోయిడాలోనూ పోలీసులు క్షుణ్ణంగా త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ బాంబు బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఐపీ అడ్ర‌స్‌ల ఆధారంగా కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మంత్రి అతిషి కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పోలీసుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆమె ఆదేశించారు.