Bull Rides Activa | అన్ బిలివ‌బుల్.. యాక్టివాపై దూసుకెళ్లిన ఎద్దు.. వీడియో

Bull Rides Activa | ఎద్దు( Bull ).. అంటేనే ఎడ్ల బండి( Bull Cart ) గుర్తుకు వ‌స్తుంది. ఎడ్ల బండిని లాగ‌డ‌మే ఎద్దుల ప‌ని. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఉప‌యోగించే ఓ ఎద్దు.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా యాక్టివా( Activa )పై దూసుకెళ్లింది. యాక్టివాపై ఎద్దు( Bull Rides Activa ) దూసుకెళ్లిన వీడియో చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

Bull Rides Activa | అన్ బిలివ‌బుల్.. యాక్టివాపై దూసుకెళ్లిన ఎద్దు.. వీడియో

Bull Rides Activa | ఇది అన్ బిలివ‌బుల్( unbelievable ) ఇన్సిడెంట్. అస‌లు మీరెవ‌రూ ఊహించి ఉండ‌రు కూడా. సాధార‌ణంగా బైక్‌( Bike Ride )ల‌ను మ‌న‌షులే న‌డుపుతారు. కానీ ఓ ఎద్దు యాక్టివా( Bull Rides Activa )పై దూసుకెళ్లి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్( Viral Video ) అవుతోంది.

ఉత్త‌రాఖండ్‌( Uttarakhand )లోని రిషికేశ్( Rishikesh ) ప్రాంతం అంది. ఓ వీధిలో ఎద్దు( Bull ) న‌డుచుకుంటూ వెళ్తుంది. అదే దారిలో ఓ మ‌హిళ త‌న బిడ్డ‌తో వెళ్తుంది. మ‌రో వ్య‌క్తి స్కూట‌ర్‌పై దూసుకెళ్తున్నాడు. ఉన్న‌ట్టుంది ఆ ఎద్దు.. ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన యాక్టివా( Activa ) వ‌ద్ద‌కు వెళ్లింది. ఇంకేముంది.. త‌న కొమ్ముల స‌హాయంతో ఆ యాక్టివాపై ఎద్దు( Bull Rides Activa ) దూసుకెళ్లింది. దీంతో త‌న బిడ్డ‌తో వెళ్తున్న మ‌హిళ భ‌య‌ప‌డి ప‌క్క‌కు ప‌రుగెత్తింది. కానీ ఆ ఎద్దు జ‌నాల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇక ఈ ఘ‌ట‌న‌పై కాల‌నీ వాసులు తీవ్రంగా స్పందించారు. ప‌శువులు రోడ్ల‌పై విచ్చ‌ల‌విడిగా సంచ‌రిస్తూ స్థానికుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంపై ఎన్నిసార్లు అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు.