బస్టాండ్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు

విధాత: దోచిన సొమ్ము ఏదైనా దొంగోడికి లాభమన్న సామేతను మరిపించేలా బెంగళూరులో దొంగలు ఏకంగా బస్టాండ్‌నే ఎత్తుకెళ్లిపోయారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్ షెడ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో బస్టాండు నిర్మాణం చేశారు. దీనిని దొంగలు మాయం చేశారు. దొంగలు ఈ బస్టాండ్ షెడ్‌నే ఎందుకు ఎత్తుకెళ్లారంటే దాని నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ కోసమని తెలుస్తోంది.