Cabinet Approval For DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంపు

కేంద్ర ఉద్యోగులకు 3% డీఏ పెంపు, జూలై నుంచి అమలు, రూ.60 వేల జీతానికి అదనంగా రూ.34,800 లాభం

Cabinet Approval For DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 10,084 కోట్ల భారం పడనుంది. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు. ఈ ఏడాది మార్చిలో రెండు శాతం డీఏ పెంచారు. దీంతో డీఏ 53 నుంచి 55 శాతానికి చేరింది. తాజాగా 3 శాతం పెంచారు. అంటే రూ. 60 వేల బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి అదనంగా రూ.34,800 డీఏ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్ మెంట్ 1.83 నుంచి 2.86 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 13 నుంచి 34 శాతం పెంపుదల ఉండవచ్చని చెబుతున్నారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే….

17 రాష్ట్రాల్లో 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 5863 కోట్లను ఖర్చు చేయనున్నారు. రూ.11,440 కోట్లతో పప్పుధాన్యాల స్వయం వృద్ధికి కేబినెట్ అనుమతిని ఇచ్చింది. మరో వైపు గోధుమలకు మద్దతు ధర పెంచాలని నిర్ణయం తీసుకుంది. క్వింటా గోధుమలకు మద్దతు ధరను రూ. 160కు పెంచారు. దీంతో గోధుమ క్వింటా ధర రూ. 2,585కు చేరింది.