Low Interest Loan For Farmers | తక్కువ వడ్డీకే రైతులకు రూ. 3 లక్షల రుణం: అందరికీ వస్తోందా?
రైతులకు తక్కువ వడ్డీకే రూ.3 లక్షల రుణం, సకాలంలో చెల్లిస్తే అదనపు రాయితీతో ఆర్థిక భారం తగ్గనుంది.

Low Interest Loan For Farmers | రైతులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసే సమయంలో రైతులకు ఆర్ధిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ఈ స్కీమ్ కింద ఒక్కో రైతు రూ. 3 లక్షల వరకు రుణం తీసుకువచ్చు. 2025-26 బడ్జెట్ లో రైతులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణం తీసుకుంది. ఈ పథకాన్ని రిజర్వ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) అమలు చేస్తాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రైతులకు వడ్డీ రాయితీ స్కీమ్ ను అమలయ్యేలా చూస్తాయి.
సవరించిన వడ్డీ రాయితీ పథకం అంటే ఏంటి?
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఖరీఫ్, రబీ సీజన్ ప్రారంభ సమయంలో పెట్టుబడి కోసం ఇబ్బందిపడకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సహయం అందిస్తున్నాయి. దీనికి తోడుగా ఇచ్చే రుణానికి వడ్డీ రాయితీని అందింస్తారు. 2006-07 ఆర్ధిక సంవత్సరంలో ఈ స్కీమ్ ప్రారంభించారు. ప్రతి ఏటా ఈ స్కీమ్ ను కొనసాగిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంబవించిన సమయంలో కూడా సవరించిన వడ్డీ రాయితీ పథకం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్ కింద రైతులు రూ. 2 లక్షలను స్వల్పకాలిక రుణంగా తీసుకోవచ్చు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో స్వల్పకాలిక రుణాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షలల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. పశు పోషణ, పౌల్ట్రి , ఫిషరీష్ వంటి వాటికి వర్కింగ్ కేపిటల్ కోసం వినియోగించుకోవచ్చు. అతి తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఏడు శాతం వార్షిక వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తారు. సకాలంలో చెల్లిస్తే అదనపు వడ్డీ రాయితీలుంటాయి. రైతులకు బ్యాంకులు 1.5 శాతం వడ్డీ రాయితీ కింద అప్పులు ఇస్తాయి. అయితే ఈ వడ్డీ రాయితీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. సకాలంలో అప్పులు తీర్చడం ద్వారా వడ్డీ రేటు 4 శాతం తగ్గుతుంది. అయితే ఈ స్కీమ్ కింద ప్రత్యేకంగా ధరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. పంట రుణాలు తీసుకొనే రైతులందరికీ ఇది ఆటోమెటిక్ గా వర్తింపజేస్తారు. రైతులపై ఆర్ధిక భారం తగ్గేందుకు ఈ స్కీమ్ దోహదపడుతతుంది. వడ్డీ కూడా చాలా వరకు తగ్గుతుంది. వడ్డీ భారం తగ్గడంతో రైతులు ఆర్ధిక స్థిరత్వాన్ని పొందుతారు.
ఎవరు అర్హులు?
- 18 నుంచి 75 ఏళ్ల వయస్సున్న రైతులంతా ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేసుకోవచ్చు.
- స్వంతంగా భూమి ఉండి వ్యవసాయం చేస్తున్నవారంతా అర్హులే
- కౌలు రైతులకు కూడా ఈస్కీమ్ వర్తిస్తోంది.
- స్వయం సహాయక గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా కూడా ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేసుకోవచ్చు
- వ్యవసాయ పెట్టుబడితో పాటు వ్యవసాయ అనుబంధంగా ఉండే వాటి కోసం కూడా ఈ స్కీమ్ కింద రుణాలు తీసుకోవచ్చు
- మెజారిటీ బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు రుణాలు అందిస్తాయి.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి?
రైతు లేదా కౌలు రైతు గుర్తింపు కార్డు
అడ్రస్ తెలిపే గుర్తింపు కార్డు
పట్టాదారు పాసుబుక్
బ్యాంకు ఖాతా వివరాలు