Suresh Gopi : 'మీ షాపుగానీ, షాపింగ్ మాల్‌గానీ ఏదైనా సరే కోరితే నా చేతులతో ప్రారంభిస్తా. అంతేకాదు మీ వ్యాపారాలకు ప్రమోషన్ కావాలంటే చేసి పెడుతా. కాకపోతే డబ్బులు ఇవ్వాలి. మిగతా సినిమా స్టార్లకు ఎంతిస్తారో అంత నాకూ ఇవ్వాలి' అంటూ ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రిగా ఉన్నారు.
Suresh Gopi : ‘మీ షాపుగానీ, షాపింగ్ మాల్‌గానీ ఏదైనా సరే కోరితే నా చేతులతో ప్రారంభిస్తా. అంతేకాదు మీ వ్యాపారాలకు ప్రమోషన్ కావాలంటే చేసి పెడుతా. కాకపోతే డబ్బులు ఇవ్వాలి. మిగతా సినిమా స్టార్లకు ఎంతిస్తారో అంత నాకూ ఇవ్వాలి’ అంటూ ప్రముఖ నటుడు, కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రిగా ఉన్నారు. మళయాళంలో మోస్ట్ సీనియర్ హీరోగా వెలుగొందిన సురేష్ గోపి.. రాజకీయాల్లోకి వచ్చి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలోనే తొలి బీజేపీ ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.
అయితే సురేష్ గోపీ ‘పైసలు ఇస్తే ప్రారంభోత్సవాలకు వస్తా’ అన్న ప్రకటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘నేను మొదట హీరోను. నాకు ఉన్న ఇమేజ్‌ను వ్యక్తిగతంగా ఉపయోగించుకుని ప్రారంభోత్సవాలు చేస్తాను. ఊరికే చేయను’ అన్నారు. డబ్బులు డిమాండ్ చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘అలా వచ్చిన డబ్బులను నా సొంతానికి ఉపయోగించుకోను. ట్రస్టుకు వెళ్తాయి. ఆ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా. కేంద్ర మంత్రిగా నాకు వచ్చే జీతంలో నుంచి కూడా 5 నుంచి 8 శాతం డబ్బులను ట్రస్టులకు ఇస్తున్నా’ అని తెలిపారు.
ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఖర్చు చేస్తానని, వ్యక్తిగతంగా ఎవరికీ డబ్బులు ఇవ్వనని సురేష్ గోపి వెల్లడించారు. 2024 జూలై 4న సాయంత్రం.. గురువాయూర్ నియోజకవర్గ బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్న సురేష్ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు. హీరోగా ఉన్న పాపులారిటీని మాత్రమే ఉపయోగించుకుని ప్రారంభోత్సవాలకు వెళతానని, మిగతా హీరోలకు, హీరోయిన్స్‌కు ఎంత అయితే డబ్బులు ఇస్తారో అంతే ఛార్జ్ చేస్తానని చెప్పారు. అలా వచ్చే డబ్బులను ట్రస్టుకు ఇస్తానన్నారు.
మొత్తానికి సురేష్ గోపీ భిన్నంగా ఆలోచిస్తున్నారని, మంచి పని చేస్తున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇంకా హీరోగానే ఆలోచిస్తే ఎలా..? ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కదా అంటున్నారు. విపక్ష పార్టీలు కూడా సురేష్ గోపీ మాటలను తప్పుపడుతున్నాయి.