Chhattisgarh Encounter| ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పేర్కొన్నారు.
విధాత : చత్తీస్ గఢ్ రాష్ట్రంలో(Chhattisgarh Encounter) జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి (Maoists Killed)చెందారు. సుక్మా జిల్లా(Sukma District)లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంలో కొబ్రా, డీఆర్జీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు మృతిం చెందారని, కాల్పులు కొనసాగుతున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులను మిలిషియా కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడైన మద్వి దేవా, సీఎన్ఎం కమాండర్ పోడియం గంగి, కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి గంగిగా గుర్తించినట్లు వెల్లడించారు. వారి వద్ద ఉన్న 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram