Odisha : ఒరిస్సాలో ఎన్ కౌంటర్ ?.ఐదుగురు మావోయిస్టుల మృతి

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. వీరి తలపై రూ. కోటికి పైగా రివార్డు ఉండటం గమనార్హం. పూర్తి వివరాలు..

Odisha : ఒరిస్సాలో ఎన్ కౌంటర్ ?.ఐదుగురు మావోయిస్టుల మృతి

న్యూఢిల్లీ : ఒరిస్సా రాష్ట్రం కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒరిస్సా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోగా.. సంఘటనా స్థలంలో మావోయిస్టుల ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో భద్రతా బలగాలు పరిసర అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్స్ ఆపరేషన్స్ ముమ్మరం చేశారు.

మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హన్మంతు 

ఎన్ కౌంటర్ మృతుల్లో ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు కూడా ఉందని తెలిపారు. హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు. రాయగఢ్‌ ఏరియా కమిటీ సభ్యుడు, బారి అలియాస్ రాకేష్‌, మరొకరిని అమృత్‌గా గుర్తించారు. బారి తలపై రూ.22 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ప్రకటించారని అధికారులు తెలిపారు. మృతుల్లో మిగతా వారిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, మరిన్ని బలగాలను మోహరించామని ఏడీజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా తెలిపారు.

ఒరిస్సా ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ట్వీట్

ఒరిస్సా కంద మాల్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ట్వీట్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు అమిత్ షా తెలిపారు. ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే మృతి చెందినట్లు వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

TGSRTC Recruitment 2025 Notification : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ
KA Paul : కేఏ పాల్ క్రిస్మస్ సందేశం..వైరల్