Maoist Ordnance Factory Seized In Sukma | మావోయిస్టుల ఆయుధ కర్మాగారం స్వాధీనం
చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, పరికరాలు కూడా పట్టుబడ్డాయి.
                                    
            విధాత: చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా అడవుల్లో భద్రతా దళాలు చేపట్టిన ఓ ఆపరేషన్‌లో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించిన వివరాల మేరకు సుక్మా జిల్లాలోని గోంగూడ -కంచాల అడవుల్లో డీఆర్ జీ(డిస్టిక్ రిజర్వ్ గార్డ్) బలగాలు మంగళవారం కూంబింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని గుర్తించాయి.
అందులో నుంచి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు , ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి ప్రభుత్వం ఇచ్చిన పిలుపును సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ సూచించారు.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram