China Bridge Collapse : చైనాలో కూలిన కేబుల్ బ్రిడ్జి..12మంది మృతి

చైనాలో కేబుల్ బ్రిడ్జి కూలి 12మంది మృతి, 4 గల్లంతు, స్టీల్ కేబుల్ విఫలమే కారణం, వీడియో వైరల్.

China Bridge Collapse : చైనాలో కూలిన కేబుల్ బ్రిడ్జి..12మంది మృతి

China Bridge Collapse | విధాత : చైనాలో(China) నదిపై నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి(Cable Bridge) కూలిన ప్రమాదంలో 12మంది మృతి చెందగా..మరో 4గురు గల్లంతయ్యారు. నిర్మాణ సమయంలో స్టీల్ కేబుల్ తెగిపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్(Project Manager) ఆ ప్రదేశంలో ఉన్నారని.. బ్రిడ్జి ఆర్చ్ విభాగం మధ్యలో స్టీల్ కేబుల్( steel cable) అకస్మాత్తుగా తెగి క్రింద ఉన్న ఎల్లో నది నీటిలోకి పడియిందని వెల్లడించారు.

సిచువాన్-కింగ్‌హై రైల్వేలోని(Sichuan-Qinghai Railway) ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే అతిపెద్ద-స్పాన్ డబుల్-ట్రాక్(world’s largest-span double-track) నిరంతర స్టీల్ ట్రస్ ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. చైనాలోనే రెండవ అతి పొడవైన నది ఎల్లో నది. మొట్టమొదటి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జిని( first railway steel truss arch bridge) ఈ నదిపైన చైనా నిర్మిస్తుంది. చైనాలో నిర్మాణ ప్రమాణాలు..నిబంధనలు చాల పక్కాగా ఉన్నప్పటికి ఈ బ్రిడ్జి ప్రమాదం జరుగడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుపుతుంది.