Cobra Swallows Knife | కత్తిని మింగిన నాగుపాము.. ఎందుకో తెలుసా..? వీడియో
Cobra Swallows Knife | ఓ భారీ నాగుపాము( King Cobra ) 12 ఇంచుల కత్తి( Knife )ని మింగేసింది.. పాము కత్తిని మింగడం ఏంటని ఆశ్చర్య పోకండి.. మీరు చదువుతున్నది నిజమే. కిచెన్( Kitchen )లోకి వెళ్లిన ఆ నాగుపాము.. కత్తిని అమాంతం మింగేసి.. నరకయాతన అనుభవించింది.

Cobra Swallows Knife | ఓ భారీ నాగుపాము( King Cobra ) బుసలు కొడుతూ.. ఓ ఇంట్లోకి( House ) ప్రవేశించింది. ఇక ఆ ఇంట్లోని వంట గది( Kitchen )లోకి మెల్లిగా దూరింది నాగుపాము. అక్కడ ఆహారం కోసం వెతికిందో ఏమో తెలియదు కానీ.. అక్కడున్న ఓ కత్తి( Knife )ని అమాంతం మింగేసింది.
దాంతో అది పడగ విప్పలేని పరిస్థితి ఏర్పడింది. ముందుకు కదల్లేక నరకయాతన అనుభవించింది నాగుపాము. ఆ ఇంటి యజమాని నాగుపామును గమనించి.. స్నేక్ క్యాచర్( Snake Catcher )కు సమాచారం అందించాడు. ఆ ఇంటి వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ పవన్, వెటర్నరీ అసిస్టెంట్ అద్వైత్ భట్ కలిసి నాగుపామును పట్టుకున్నారు.
అనంతరం అటవీ ప్రాంతంలోకి నాగుపామును తీసుకెళ్లి.. మెడికల్ సీజర్స్( Medical Scissors ) సహాయంతో దాని నోట్లో నుంచి కత్తిని బయటకు లాగేశారు. అయితే ఆ కత్తికి చెక్కతో చేసిన కాడ ఉండడంతో.. పాముకు ఎలాంటి హానీ కలగలేదు. దాంతో ఆ కత్తి( Knife )ని నాగుపామును అమాంతం మింగేసింది. కానీ ముందు భాగం పదునుగా ఉండడంతో కాసేపటి తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడింది. నాగుపాము మింగిన కత్తి 12 ఇంచులు ఉండి. అంటే ఒక ఫీట్ పొడవు.
కత్తిని తీసిన తర్వాత నాగుపాము ఊపిరి పోసుకుంది. ఊపిరితో ఉన్న ఆ నాగుపామును స్నేక్ క్యాచర్, వెటర్నరీ అసిస్టెంట్ కలిసి అడవుల్లోకి వదిలేశారు. నెమ్మదిగా నాగుపాము అడవుల్లోకి వెళ్లింది. ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని హెడ్గే గ్రామం( Hedge Village )లోని గోవింద నాయక్ ఇంట్లో వెలుగు చూసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి మీరు ఓ లుక్కేయండి..