Delhi Blast : ఢిల్లీ పేలుడు ఘటనలో మూడవ కారు గుర్తింపు

ఢిల్లీ పేలుడు కేసులో మూడవ కారు గుర్తింపు. జిహాదీ షాహిన్ పేరిట బ్రెజా కారు రిజిస్ట్రేషన్, ఎన్‌ఐఏ దర్యాప్తు వేగం పెంచింది.

Delhi Blast : ఢిల్లీ పేలుడు ఘటనలో మూడవ కారు గుర్తింపు

న్యూఢిల్లీ : ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు బృందాలు 3వ కారును గుర్తించాయి. జిహాదీ షాహిన్ పేరిట కారు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. అల్-ఫలాహ్ వర్సిటీ ప్రాంగణంలో మారుతీ బ్రెజా కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారిస్తున్నాయి. ఐ20, ఎకోస్పోర్ట్‌ వాహనాలే కాకుండా మరో రెండు పాత కార్లలోనూ బాంబులు అమర్చి పేలుళ్లకు సిద్ధం చేయాలని నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. నాలుగు నగరాల్లో ఇద్దరు చొప్పున పేలుళ్లకు ప్లానింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి గ్రూప్‌ నుంచి భారీగా ఐఈడీ తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పేలుళ్లకు 8 మంది అనుమానితులు కుట్ర పన్నినట్లు తెలిపారు.