Delhi Red Fort Blast| ఉగ్ర మూకలో మెజార్టీ డాక్టర్లే…200మంది డాక్టర్లపై ఎన్ఐఏ ఫోకస్

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల కేసుతో పాటు ఫరిదాబాద్ పేలుడు సామాగ్రీ కేసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తన్నాయి. దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్రకు పథక రఛన చేసిన ఉగ్ర మూకలలో మెజార్టీ సంఖ్యలో డాక్టర్లు ఉండటం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురి చేస్తుంది. 200 మంది డాక్టర్లును, వైద్య విద్యార్థులు ఎన్ఐఏ అనుమానిత జాబితాల ఉండటం సంచనంగా మారింది.

Delhi Red Fort Blast| ఉగ్ర మూకలో మెజార్టీ డాక్టర్లే…200మంది డాక్టర్లపై ఎన్ఐఏ ఫోకస్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల(Delhi Red Fort Blast) కేసుతో పాటు ఫరిదాబాద్ పేలుడు సామాగ్రీ కేసుల విచారణ(Investigation)లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తన్నాయి. దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్రకు పథక రఛన చేసిన ఉగ్ర మూకల(Terror Module)లో మెజార్టీ సంఖ్యలో డాక్టర్లు(Doctors) ఉండటం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికే ఉగ్రముఠాలో ఎర్రకోట పేలుడులో ఆత్మాహుతి దాడి నిందితుడు ఉమర్ నబీతో పాటు 10మంది వైద్యులను ఎన్ఐఏ(NIA) గుర్తించగా.. వారిలో 8మందిని అరెస్టు చేసింది. ముఠాలో డాక్టర్‌ ఉమర్‌ నబీతో పాటు డాక్టర్‌ ముజమ్మిల్‌ షేక్‌, డాక్టర్‌ ఆదిల్‌ అహ్మద్‌, డాక్టర్‌ షాహిన్‌ షహిద్‌, డాక్టర్‌ పర్వేజ్‌ సయ్యద్‌ అన్సారీ, డాక్టర్‌ ముజఫర్‌ అహ్మద్‌, డాక్టర్‌ మొహియుద్దీన్‌ సయ్యద్‌ అనుమానితుల జాబితాలో ఉన్నారు. ఇప్పటికే అల్‌ ఫలాహ్‌ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నిసార్‌ ఉల్‌ హసన్‌ కనిపించకుండా పోయారు.

తాజాగా వైద్య విద్యార్థిని ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 200 మంది డాక్టర్లును, వైద్య విద్యార్థులు ఎన్ఐఏ అనుమానిత జాబితాల ఉండటం సంచనంగా మారింది. ఉగ్రవాద సంస్థలకు ఆ డాక్టర్లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదో నిర్ధారించేందుకు వారిని ప్రశ్నించే ప్రక్రియ ప్రారంభించింది. ఢిల్లీ ఉగ్రదాడిలో మరో వైద్య విద్యార్థి అరెస్ట్ అనంత మెడికల్ కాలేజీలో అరెస్ట్ ప్రియాంక శర్మకు సంబంధాలు మరో 200 మంది డాక్టర్లు మెడికల్ పై ఎన్ఐఏ ఫోకస్ ప్రశ్నిస్తున్నారు. కాల్‌డేటా, నిందితుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది వైద్యుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీలో అనేక పత్రాలు స్వాధీనం చేసుకునిపరిశీలిస్తున్నారు. పేలుడు కేసులో రెండు ఎఐఆర్ లు నమోదయ్యాయి. యూనివర్సిటీకి, ఉగ్రవాదులకు వచ్చిన నిధులపై ఆరా తీస్తున్నారు.