Al-Falah University | ఆర్థిక మోసాలతో పుట్టిన అల్ ఫలాహ్ వర్సిటీ..ఏఐయు సభ్యత్వం రద్ధు
ఆర్థిక మోసాలతో పుట్టిన అల్ ఫలాహ్ వర్సిటీ..మూడేళ్లు జైలుకెళ్లిన వ్యవస్థాపకుడు.. యూనివర్సిటీ ఏఐయు సభ్యత్వం రద్ధు..కేంద్రం ఆదేశంలో రంగంలోకి ఈడీ
హైదరాబాద్, విధాత: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడు తరువాత కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యకలాపాలు, నిధుల నిర్వహణ, అవకతవకలపై ఈడీ విచారణ కు ఆదేశించింది. గుర్తింపు లేకుండానే ప్రచారం చేసుకుంటున్నందకు నాక్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్ధు చేస్తున్నట్లు ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయు) ప్రకటించింది. తమ లోగో ను తక్షణమే వెబ్ ఫోర్టల్ నుంచి కూడా తొలగించాలని అల్ ఫలాహ్ ను ఏఐయూ ఆదేశించింది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఢిల్లీ-హర్యానా సరిహద్దు కు 27 కిలోమీటర్ల దూరంలోని ఫరీదాబాద్ లో ఉంది. 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనివర్సిటీలో ఉమర్ మొహమ్మద్, షాహిన్ సయిద్, అదిల్ రాథర్, ముజమ్మిల్ షకీల్ వైద్యులుగా పనిచేస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబు విస్పోటనలో వీరి పాత్ర ఉండడంతో నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. యూనివర్సిటీ నిర్వహణ కు అందుతున్న ఆర్థిక సాయం, నిధులపై ఈడీ విచార ప్రారంభించింది. యూనివర్సిటీ రికార్డులు, ఆర్థిక కార్యకలాపాలపై పూర్తిగా జల్లెడ పడుతున్నారు. రికార్డులు స్వాధీనం చేసుకుని సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
Readmore : ‘ఢిల్లీలో ఏదో జరగబోతోందా?’.. పేలుడుకు ముందు విద్యార్థి పోస్ట్
అంబేద్కర్ పుట్టిన పట్టణంలో జావద్ జననం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా మోవ్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మించారు. ఇదే పట్టణంలో జావద్ అహ్మద్ సిద్ధిఖీ 1964 లో పుట్టి పెరిగారు. ఆ తరువాత ఈ పట్టణం పేరును డాక్టర్ అంబేద్కర్ నగర్ గా మార్పు చేశారు. జావద్ ఇండోర్ లోని దేవీ అహిల్యా విశ్వ విద్యాలయం నుంచి ఇండస్ట్రియల్, ప్రొడక్ట్ డిజైన్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత కుటుంబంతో కలిసి ఢిల్లీ మకాం మార్చారు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు, డబ్బులు సంపాదన కోసం కలలు కనేవాడని స్నేహితులు చెబుతున్నారు. 1993 లో జామియా మిల్లియా ఇస్లామియా లో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అక్కడ పనిచేస్తునే సోదరుడు సావూద్ తో కలిసి వ్యాపారాలు నిర్వహించేందుకు పలు ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేశాడు. అల్ ఫలాహ్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ ఏర్పాటు చేసి స్నేహితులు, సన్నిహితులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చుకున్నాడు. పెట్టుబడులు పెట్టిన వారికి పెద్ద మొత్తంలో తిరిగి చెల్లిస్తానని హామీలు ఇచ్చాడు. మోసపూరితంగా డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వడం లేదంటూ 2000 సంవత్సరంలో కేఆర్.సింగ్ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఆర్థిక నేరాల విభాగం విచారించింది. పెట్టుబడిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి, డిపాజిట్లను స్వంత ఖాతాలను మళ్లించినట్లు వెల్లడైంది. ఈ నిధులను స్వంత అవసరాలకు వినియోగించుకున్నట్లు తేలింది. ఆర్థికంగా మోసం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు జావద్ తో పాటు సోదరుడు సావుద్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2004 లో జైలు నుంచి విడుదలైన సోదరులు, డిపాజిట్ దారులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు.
Readmore : దీపావళికే దాడి ప్లాన్..గణతంత్ర దినోత్సవానికి మరోసారి!
అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావద్
ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న జావద్ అహ్మద్ సిద్ధిఖీ అల్ ఫలాహ్ యూనివర్సిటీని స్థాపించారు. అందులోనే అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా, వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా అల్ ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల పరిధిలో డజన్ల కొద్దీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ వర్సిటీలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నవంబర్ 15వ తేదీన జామియా నగర్ అల్ ఫలాహ్ హౌస్ లో జావద్ తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఢిల్లీ ఎర్రకోట వద్ద 10వ తేదీన బాంబు పేలుళ్లు జరిగాయి. తన యూనివర్సిటీలో పనిచేస్తున్న వైద్యులే బాంబు దాడిలో పాల్గొనడంతో వేడుకలు రద్ధు చేసుకున్నారు.
Readmore : ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ఫరీదాబాద్ కాలేజీ మినీ కాశ్మీర్
అల్ ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2019లో ప్రారంభించారు. క్రమక్రమంగా కాశ్మీర్ నుంచి వైద్యులను నియమించుకోవడం మొదలు పెట్టారు. ముస్లిం మైనారిటీ విద్యా సంస్థ కావడం, తక్కువ వేతనాలకు రావడంతో వారిని నియమించుకున్నారు. కోవిడ్ సమయంలో నిరంతరం సేవలు అందించిన నర్సులు తమకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆందోళనకు దిగారు. ఇది నచ్చని యాజమాన్యం వారిని విధుల నుంచి సామూహికంగా తొలగించింది. కాలేజీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని, స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని నర్సింగ్ విద్యార్థులు ఆరోపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram