Anant Ambani Wedding|అట్టహాసంగా అనంత్ అంబాని- రాధికకి పెళ్లి వేడుక.. అక్కడి ఎంప్లాయిస్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్
Anant Ambani Wedding| రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబాని ఎట్టకేలకి రాధిక మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. ముంబై మహానగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరగనుంది. అయితే ఈ పెళ్లి వేడుక సందర్భంగా ముంబైలోని హోటళ్ల ఆక్యుపెన్సీని, ధరలను అతి భారీగా పెంచేశారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో వివాహం జరగనున్న నేపథ్యంలో

Anant Ambani Wedding| రిలయన్స్ అధిపతి ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబాని ఎట్టకేలకి రాధిక మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. ముంబై మహానగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరగనుంది. అయితే ఈ పెళ్లి వేడుక సందర్భంగా ముంబైలోని హోటళ్ల ఆక్యుపెన్సీని, ధరలను అతి భారీగా పెంచేశారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో వివాహం జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు స్టార్ హోటళ్లలో రూములన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయి. ట్రావెల్, హోటల్ వెబ్‌సైట్లలోకి వెళితే, ఆ హోటళ్ల రూమ్స్‌కు ‘సోల్డ్ ఔట్’ మెసేజ్ దర్శనం ఇస్తుంది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో హోటల్ రూమ్ బుకింగ్ కోసం ట్రావెల్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేస్తే… జులై 9న ఒక రాత్రికి రూ. 10,250, జులై 15న రూ. 16,750, జులై 16న రూ. 13,750 ఇలా రేట్స్ కనిపించాయి. వీటికి పన్నులు అదనం.
మరోవైపు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ఒకటి. ఆ ప్రాంతంలో చాలా నేషనల్, మల్టీ-నేషనల్ కంపెనీల ఆఫీస్‌లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ గ్రేడ్ A ఆఫీస్ స్పేస్‌లు అని చెప్పాలి. ఈ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఆయిల్, గోద్రేజ్ BKC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డైమండ్ బోర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, వివర్క్ వంటి కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయి. అయితే అనంత్ అంబాని పెళ్లిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న అనేక కార్యాలయాలు జూలై 15 వరకు ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. ట్రాఫిక్ మళ్లింపులు, పరిమితులు కొనసాగుతున్నాయి
అనంత్- రాధికాల వివాహం మొదటి ఆచారం ప్రకారం జూలై 3న జరిగింది. దీనిని మామేరు ఆచారం అంటారు. అదే సమయంలో ఇద్దరూ జూలై 12న పెళ్లి చేసుకోనున్నారు. వెడ్డింగ్ తర్వాత.. జూలై 13న శుభ ఆశీర్వాదం, జూలై 14న మంగళ్ ఉత్సవ్ జరుగుతాయని తెలుస్తోంది. ఈ వివాహానికి దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు దేశాధినేతలు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కిమ్ కర్దర్శియాన్, ఖోలీ కర్దాషియాన్, యూకే మాజీ పీఎం బోరిస్ జాన్సన్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ టైక్లెట్, ప్రెట్ ఎ మ్యాంగర్ సీఈవో పనో క్రిస్టౌ, రామ్ చరణ్, ప్రముఖ జానపద గాయకుడు మామే ఖాన్ తదితరులు హాజరు కానున్నారు.