Delhi Wall Collapse | ఢిల్లీలో విషాదం.. గోడ కూలీ 8మంది మృతి
భారీ వర్షాలు, వరదలతో ఢిల్లీ వణికిపోతోంది. జైత్‌పూర్ హరినగర్‌లో గోడ కూలిన ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. రాజధానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Delhi Wall Collapse | న్యూఢిల్లీ : భారీ వర్షాలు..వరదలు ఢిల్లీ వాసులను వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో గోడ కూలీన ఘటనలో 8మంది మరణించారు. జైత్‌పూర్‌లోని హరినగర్‌లో ఓ ఇంటి గోడ కూలిన ప్రమాదంలో 8మంది చనిపోగా..
మృతుల్లో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ బృందాలు శిధిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. ఢిల్లీ వ్యాప్తంగా రెండు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టిను తలపించేలా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వర్షంకారణంగా కన్నౌట్ ప్యాలెస్, మథుర రోడ్డు, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే దాదాపు 210 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..