Rajya Sabha Elections Notification | తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణాలోని రాజ్యసభ సీటుతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల(Elections to Rajya Sabha seats) నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

21వరకు నామినేషన్ల దాఖలు
27న ఉపసంహరణ
సెప్టెంబర్ 3న పోలింగ్..ఫలితాలు
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని
Rajya Sabha Elections Notification | తెలంగాణాలోని రాజ్యసభ సీటుతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల(Elections to Rajya Sabha seats) నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ(Nomination Process) కొనసాగనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 27 వరకు నామినేషన్ ఉపసంహరణకు(Withdrawal of nomination) గడువు, సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ప్రకటించనున్నారు(Counting of votes will be announced on the same day). 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వసించనున్నారు. తెలంగాణలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామాతో(Rajya Sabha member K. Kesha Rao resigned) ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కేకే స్థానంలో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని(Abhishek Manu Singhvi) అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేకే స్థానంలో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రకటన విడుదల చేసింది.