Elephant | రైలు ఢీ కొని గజరాజు మృతి.. ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న ఏనుగులు
అస్సోంలోని జాగీరోడ్ సమీపంలో కంచన్‌జంగా రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన ఏనుగు అక్కడిక్కడే ఊపిరి వదిలింది. ప్రమాదంలో గాయాలతో విలవిలలాడిన గజరాజు సంఘటన స్థలం నుంచి పట్టాలు సైతం దాటలేక అక్కడే కుప్పకూలి మరణించింది

విధాత, హైదరాబాద్ : అస్సోంలోని జాగీరోడ్ సమీపంలో కంచన్‌జంగా రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన ఏనుగు అక్కడిక్కడే ఊపిరి వదిలింది. ప్రమాదంలో గాయాలతో విలవిలలాడిన గజరాజు సంఘటన స్థలం నుంచి పట్టాలు సైతం దాటలేక అక్కడే కుప్పకూలి మరణించింది. తరుచు రైలు మార్గాలు దాటుతూ ఏనుగులు ప్రాణాలు కోల్పోతుండటం పట్ల వన్యప్రాణుల ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. రైళ్లు ఢీ కొట్టిన ఘటనలో అత్యధికంగా అస్సాంలో 29 ఏనుగులు మృత్యువాత పడగా, ఒడిశాలో 21 ఏనుగులు మృతి చెందాయి. దేశవ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో వేట, ప్రమాదాలు వంటి కారణాలతో 600కుపైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ లెక్కల సమాచారం. 389 ఏనుగులు విద్యుద్ఘాతాల కారణంగా మృతి చెందగా, రైలు ప్రమాదాల ద్వారా 85, వేటాడడం ద్వారా 57, దంతాల కోసం విష ప్రయోగంతో 31ఏనుగులు చనిపోయినట్లుగా తెలుస్తుంది.
అస్సోంలోని జాగీరోడ్ సమీపంలో కంచన్‌జంగా రైలు ఢీకొట్టడంతో తీవ్రగాయాలై.. అక్కడిక్కడే ఊపిరి వదిలిన గజరాజు.
Follow @bigtvtelugu for more updates#SayNoToDrugs #Assam #kanchanjungaexpressaccident #ElephantDeath #TeluguNews #Newsupdates #bigtvlive pic.twitter.com/RvlfIiSbwU
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2024
విద్యుద్ఘాతంతో ఒడిశాలో ఐదేళ్లలో 87 ఏనుగులు తమిళనాడు, అస్సాం రాష్ట్రాలలో 59 చొప్పున మృతి చెందాయని సమాచారం. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో శాశ్వత సమన్వయ కమిటీని గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైలు నడిపే పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగుల ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్లు వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్ ఎలివేటెడ్ విభాగాలను ఆధునికరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్ పాస్, ఓవర్ పాసులను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్‌గా పెట్రోల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గతంలో తెలిపింది