క‌ర్ణాట‌కలో దారుణం.. బ్రేక‌ప్ చెప్పింద‌ని గొంతు కోశాడు

త‌న‌కు బ్రేక‌ప్ చెప్పింద‌ని ప్రియురాలిని 23 ఏండ్ల‌ యువకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో చోటుచేసుకున్న‌ది

క‌ర్ణాట‌కలో దారుణం.. బ్రేక‌ప్ చెప్పింద‌ని గొంతు కోశాడు
  • ప్రియురాలిని దారుణంగా చంపేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థి
  • క‌ర్ణాట‌క హాస‌న్ జిల్లాలో ఘ‌ట‌న‌.. నిందితుడి అరెస్టు


విధాత‌: త‌న‌కు బ్రేక‌ప్ చెప్పింద‌ని ప్రియురాలిని 23 ఏండ్ల‌ యువకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో చోటుచేసుకున్న‌ది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. నిందితుడు తేజస్‌, బాధితురాలు 20 ఏండ్ల సుచిత్ర ఒకే ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుకొన్నారు. వారి మ‌ధ్య ప్రేమ చిగురించింది. కొంత‌కాలంగా వారు ప్రేమించుకుంటున్నారు. కొన్నాళ్లు రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు. కానీ, ఇటీవ‌ల ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వలు జరుగుతున్నాయి. దాంతో ఇటీవ‌ల ఆమె అత‌డికి బ్రేక‌ప్ చెప్పింది. అత‌డితో దూరంగా ఉంటుంది.


త‌న‌కు బ్రేక‌ప్ చెప్పిన‌ ప్రియురాలిని చంపాల‌ని నిర్ణ‌యించుకున్న తేజాస్‌.. శుక్ర‌వారం తమ సమస్యలను చర్చించుకుందామ‌ని సుచిత్ర‌ను ఏకాంత‌ ప్ర‌దేశానికి పిలిపించాడు. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న యువ‌తిని స్థానికులు గమ‌నించి ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితుడి అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.